Home /News /technology /

CENTRAL GOVT WANTS YOU TO UPDATE YOUR APPLE IPHONE IPOD IMMEDIATELY GH SK

Apple iPhone: ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త వెర్షన్‌‌పై కేంద్రం కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apple Iphone Updates: ఐఫోన్ 6 సిరీస్, ఐప్యాడ్ ప్రో (అన్ని మోడల్స్), ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ మినీ 4, ఐపాడ్ టచ్ (7వ తరం) డివైజ్‌లలో సెక్యూరిటీ లోపాలున్నట్లు CERT-In గుర్తించింది. వీటిని తాజా ఐఓస్ వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని కోరింది

ఇంకా చదవండి ...
Apple iPhone: ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలంటున్న ప్రభుత్వం
మీరు యాపిల్‌ ఐఫోన్, ఐప్యాడ్లను వాడుతున్నారా?.. అయితే మీ డివైజ్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ ఇన్- CERT-In) హెచ్చరిస్తోంది. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ప్రభుత్వ ఏజెన్సీ డేటా చోరీపై యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటుంది. తాజాగా iOS, iPadOS రెండింట్లోనూ ప్రధానంగా వాడే వెబ్‌కిట్‌లో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లను తమ పాత వెర్షన్ల నుంచి ఐఓఎస్ 14.7.1, ఐప్యాడ్ ఓస్ 14.7.1 వెర్షన్లకు మారాలని కోరింది. భద్రతా పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ అప్‌డేట్ కీలకమని స్పష్టం చేసింది.

ఈ మేరకు పాత వెర్షన్లు కలిగిన ఐఫోన్లు హ్యకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని.. యూజర్లు వీలైనంత త్వరగా కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని కోరుతోంది. అందుకు అనుగుణంగా మీ పాత యాపిల్‌ ఫోన్లు, ట్యాబ్‌లలో వెంటనే ఈ కొత్త సెక్కూరిటీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. దీని కోసం యూజర్లు ముందుగా సెట్టింగ్స్ ఆఫ్షన్‌కు వెళ్లాలి. అనంతరం జనరల్‌ అనే ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పై క్లిక్ చేసి కొత్త ఐఓఎస్‌కు అప్డేట్ అవ్వాలి. అయితే ఈ కొత్త iOS ని అప్‌డేట్ చేయడం కోసం దానికి కావలసిన మెమొరీని ఖాళీగా ఉంచాలి.

సెక్యూరిటీ లోపాలున్నట్లు గుర్తింపు..
ఐఫోన్ 6 సిరీస్, ఐప్యాడ్ ప్రో (అన్ని మోడల్స్), ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ మినీ 4, ఐపాడ్ టచ్ (7వ తరం) డివైజ్‌లలో సెక్యూరిటీ లోపాలున్నట్లు CERT-In గుర్తించింది. వీటిని తాజా ఐఓస్ వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని కోరింది. యాపిల్‌ ఐఫోన్, ఐప్యాడ్లలోని ‘ఐఓ మొబైల్ఫ్రేమ్ బఫర్’ కారణంగా ఈ సెక్యూరిటీ ఇష్యూ వచ్చిందని తెలిపింది. ఇది పాత ఐఓఎస్ వెర్షన్లపై దాడి చేసి మీ డేటా చోరీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల యూజర్లు iOS 14.7.1, ఐప్యాడ్‌ ఓస్ 14.7.1 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Apple, Iphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు