హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

NavIC System: స్మార్ట్‌ఫోన్లలో ఇక GPS ఉండదు.. కొత్త సిస్టమ్‌ను తీసుకురానున్న కేంద్రం.. కారణాలు ఇవే..

NavIC System: స్మార్ట్‌ఫోన్లలో ఇక GPS ఉండదు.. కొత్త సిస్టమ్‌ను తీసుకురానున్న కేంద్రం.. కారణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NavIC System: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు గ్లోబల్‌ పొజిషనింగ్‌ నావిగేషన్‌ సిస్టమ్‌(GPS)ను వినియోగిస్తున్నాయి. అయితే భారత్ మాత్రం కొత్తగా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్‌ సిస్టమ్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు గ్లోబల్‌ పొజిషనింగ్‌ నావిగేషన్‌ సిస్టమ్‌(GPS)ను వినియోగిస్తున్నాయి. అయితే భారత్ (India) మాత్రం కొత్తగా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్‌ సిస్టమ్‌(Navigation System)ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, కొన్ని మొబైల్‌ తయారీ కంపెనీలతోనూ సమావేశాలు నిర్వహించిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇండియన్ నావిగేషన్‌ సిస్టమ్‌కు అనుకూలంగా ఫోన్లను తయారు చేయాలని ప్రభుత్వం కంపెనీలకు సూచిస్తున్నట్లు సమాచారం. అందుకు గడువును కూడా నిర్ణయించిందని నివేదికలు చెబుతున్నాయి.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(GPS)కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ నావిగేషన్‌ సిస్టమ్‌ను ఇండియా తీసుకొస్తోంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో భారత్ కొత్త నావిగేషన్‌ సిస్టమ్‌ను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఈ నావిగేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగానే షియోమి (Xiaomi), యాపిల్‌ (Apple), శామ్‌సంగ్ (Samsung) వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇకనుంచి ఫోన్లను ఇండియా తీసుకొస్తున్న కొత్త నావిగేషన్ సిస్టమ్‌కు అనుకూలంగా మార్చాలని భారత ప్రభుత్వం కోరుతోంది.

* ఫోన్ల ధరలు పెరుగుతాయా?

కొత్త నావిగేషన్ సిస్టమ్‌ను జోడించడం వల్ల ఫోన్ తయారీదారులపైనే కాకుండా చిప్‌సెట్ తయారీదారులపై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయని, కొంతకాలంగా స్థిరంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. నావిగేషన్‌ సిస్టమ్‌ మార్పు వంటి పరిణామాలతో ఫోన్ల ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.

* గడువు కావాలంటున్న కంపెనీలు

NavIC సపోర్ట్‌ అవసరమయ్యే ఫోన్‌ల గురించి వివిధ సోర్సుల నుంచి సేకరించిన సమాచారాన్ని రాయిటర్స్ ఓ నివేదికలో తెలిపింది. ఇండియన్ నావిగేషన్‌ సిస్టమ్‌కు అనుకూలంగా ఫోన్లను మార్చడానికి ప్రభుత్వం 2023 జనవరి 1ని తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే గడువు చాలా తక్కువగా కనిపిస్తోందని, హార్డ్‌వేర్ మార్పులు చేయడానికి 2025 వరకు ఫోన్ బ్రాండ్‌లు సమయాన్ని కోరినట్లు నివేదిక పేర్కొంది.

* GPSకి దూరంగా ఉండాలని నిర్ణయం

యూఎస్‌లో డెవలప్‌ చేసిన టెక్నాలజీ గ్లోబల్ పొజిషనింగ్‌ సిస్టమ్‌ నుంచి దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇండియా సెల్ఫ్‌-రిలయన్స్‌ మిషన్‌లో భాగంగా NavIC భారతదేశంలో బెస్ట్‌ నావిగేషన్ సిస్టమ్‌గా నిలిచే అవకాశం ఉందని, స్వదేశీ టెక్నాలజీ కావడం కూడా అందుకు తోడ్పడుతుందని తెలిపింది.

ఇది కూడా చదవండి : బీ అలర్ట్.. ఫేస్‌బుక్‌లో చేయకూడని 5 పనులు ఇవే.. లేదంటే జైలుకే!

గ్లోబల్‌ పొజిషనింగ్ సిస్టమ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, హార్డ్‌వేర్ సెటప్‌లో NavIC తప్పనిసరిగా ఉండాలనే ప్రతిపాదనను భారత ప్రభుత్వం ముందుకు తెస్తోందని సమాచారం. ఇటువంటి మార్పులు ఫోన్ తయారీదారులు తమ డిజైన్, ప్రొడక్షన్ ప్లాన్‌లను పూర్తిగా మార్చాల్సిన అవసరాన్ని కల్పిస్తాయని రాయిటర్స్‌ నివేదిక తెలిపింది. ఈ అంశానికి సంబంధించి శామ్‌సంగ్, షియోమి కంపెనీలు గత నెలలో సంబంధిత మంత్రిత్వ శాఖతో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై కంపెనీలు లేదా ఇస్రో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Gps, Smartphones, Tech news

ఉత్తమ కథలు