Home /News /technology /

CENTRAL GOVERNMENT TAKEN DECISION OF MAKING PASSENGER AIRBAG MANDATORY FOR ALL VEHICLES NS GH

Explainer: ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి.. త్వరలో రానున్న మరి కొన్ని కొత్త సేఫ్టీ రూల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత శుక్రవారం (మార్చి 5) జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత శుక్రవారం (మార్చి 5) జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రతి వాహనంలో డ్రైవర్, డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న ప్యాసెంజర్ కి రక్షణగా ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేసేలా నిబంధనలు విధించారు. రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ సూచనల మేరకు ఈ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త వాహనాలకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని నిర్ణయించింది కేంద్రం. ఇకపై అన్ని కార్లు, ఇతర వాహనాల తయారీదారులు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ ఫిట్ చేసిన మోడల్స్ నే అమ్మాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వెహికల్ ఓనర్లు ఆగస్టు 31లోపు ఎయిర్ బ్యాగ్స్ ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

గతంలో డిసెంబర్ 29, 2020న ఈ ప్రపోజల్ ని ప్రారంభించిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1 , పాత వాహనాలకు జూన్ 1 లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి.

దీని ప్రకారం ఇకపై ఏ కంపెనీ కొత్త కారు మోడల్ ని లాంఛ్ చేసినా తప్పనిసరిగా ముందు రెండు సీట్లకు గాను ఎయిర్ బ్యాగ్స్ ఫిట్ చేయాల్సిందే. ఇప్పటికి మారుతీ సుజికీ ఆల్టో, వేగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, హ్యుండయ్ సాంత్రో, డాట్ సన్ రెడి గో, మహీంద్రా బొలెరో వంటి వాహనాలన్నింటికీ కేవలం డ్రైవర్ సైడ్ మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలన్నీ తమ మోడల్స్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే కొత్తగా లాంఛ్ చేసిన మోడల్స్ కావు కాబట్టి ఈ మోడల్స్ అన్నింటిలో మార్పులు చేసి మార్కెట్లో అమ్మేందుకు ఈ సంస్థలకు ఆగస్టు 31 వరకూ గడువు అందించింది ప్రభుత్వం.

వరల్డ్ బ్యాంక్ నివేదిక మేరకు ప్రపంచంలో జరుగుతున్న ప్రమాదాలలో పది శాతం మేర కేవలం మన దేశంలోనే జరుగుతున్నాయట. మన దేశంలో సగటున రోజుకి 415 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారట. కారు ముందు సీటులో ఏర్పాటు చేయనున్న ఈ ఎయిర్ బ్యాగ్ మరింత భద్రతను పెంచి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదస్థాయి కాస్త తగ్గేలా చేస్తుంది. కారులో కూర్చున్న వ్యక్తులకు అదనపు భద్రతను అందిస్తుంది.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కారులోని ప్యాసెంజర్ కి కారు డాష్ బోర్డ్ కి మధ్య ఒక కుషన్ లా ఓపెన్ అవుతుందీ ఎయిర్ బ్యాగ్. దీనివల్ల వ్యక్తి శరీరం కారు డ్యాష్ బోర్డ్ కి తగిలి ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది. అలాగే కారు అద్దాలు పగిలి అవి తలకు తగలకుండా కూడా ఇది కాపాడుతుంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ (NHTSA)రీసర్చ్ ప్రకారం అమెరికాలో జరిగిన ప్రమాదాల్లో ముందు సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల ఏటా 44, 869 మంది ప్రాణాలు పోకుండా ప్రమాదం నుంచి బయటపడుతున్నారట.

ప్రమాదాలు జరిగిప్పుడు ఎయిర్ బ్యాగ్ వల్ల డ్రైవర్ సీట్ లో ఉన్న వారు మరణించే అవకాశాలు 29 మేర, పక్కన సీట్ లో కూర్చున్న వారు మరణించే అవకాశాలు 32 శాతం మేర తగ్గుతాయట. సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ రెండింటినీ ఉపయోగించడం వల్ల ప్రమాదాల్లో మరణించే వారి శాతాన్ని 61 శాతానికి తగ్గించవచ్చని.. ఇందులో కేవలం ఎయిర్ బ్యాగ్స్ వల్ల 34 శాతం మరణాలను ఆపే వీలుంటుందని NHTSA అంచనా వేసింది.

తాజా ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పటికే కార్లు ఉన్నవారే కాదు.. కొత్తగా కార్లు కొనాలనుకుంటున్న వారు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఖర్చును భరించాల్సి వస్తుంది. కారు మోడల్ ని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకూ ఎయిర్ బ్యాగ్స్ ఖర్చు అవుతుంది. కేవలం ఇవే కాదు.. కేంద్రం వాహనాల్లో ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా చేర్చనుందని వార్తలొస్తున్నాయి. 2022 నుంచి 23 నాటికి ఇవి కార్యరూపం దాల్చే వీలుంది. వీటిలో కొన్ని సేఫ్టీ ఫీచర్ల గురించి చూస్తే..

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ - రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా మనుషులు లేదా జంతువులు రోడ్డుపైన రావడం సాధారణంగా జరిగేదే. ఇలాంటప్పుడు సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఇలాంటప్పుడు కారు అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ కారు వీల్స్ ని కాపాడుతుంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా ఇది కార్ ని కాపాడుతుంది.

స్పీడ్ అలర్ట్ సిస్టమ్ - కారు 80 కిమీల వేగం దాటితే ప్రతి నిమిషానికోసారి ఈ సిస్టమ్ అలారం మోగిస్తుంది. ఇక 120 కిలోమీటర్ల వేగం దాటితే శబ్ధం చేస్తూనే ఉంటుంది. వేగాన్ని తగ్గించడానికి రూపొందించిన ఈ అలారంని ఆఫ్ చేసే అవకాశం కూడా ఉండదు.

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ - రివర్స్ గేర్ వేస్తున్నప్పుడు ఈ సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి. కారు వెనుక ఏదైనా అడ్డుగా ఉంటే కారు నడిపే వ్యక్తికి సూచనలు అందిస్తాయి. కారు అద్దాల్లో కనిపించని వస్తువులను గుద్దుకోకుండా ఇది కాపాడుతుంది.

మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ - సాధారణంగా చాలా వాహనాల్లో ప్రస్తుతం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వ్యవస్థ ఉంది. అయితే దీని వల్ల కొన్ని సార్లు అనర్థాలు జరుగుతుండడంతో మ్యాన్యువల్ గా లాకింగ్ సిస్టమ్ ని ఆపరేట్ చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు క్యాబ్స్ వంటి ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ఛైల్డ్ లాక్ సిస్టమ్ ని తొలగించనున్నారు.

సీట్ బెల్ట్ రిమైండర్ - కారులో ఉన్న డ్రైవర్ లేదా ప్యాసెంజర్స్ ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అలారం రూపంలో రిమైండర్ ఇస్తుంది. సీట్ బెల్టులు పెట్టుకోవడాన్ని ప్రోత్సహించేందుకు దీన్ని కూడా తప్పనిసరి చేయనుంది ప్రభుత్వం.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Cars, Central Government, Motor vehicle act, Road Safety

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు