హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Games: స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

Mobile Games: స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

Mobile Games: స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

Mobile Games: స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

Mobile Games | భారత ప్రభుత్వం మ్యాచ్ 3 పజిల్, హీరోస్ ఆఫ్ భారత్ పేరుతో రెండు మొబైల్ గేమ్స్ విడుదల చేసింది. ఆజాదీ క్వెస్ట్ (Azadi Quest) సిరీస్‌లో వీటిని పరిచయం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే గేమ్స్ ఇవి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్‌ను (Mobile Games) కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపు మేరకు మొబైల్ గేమ్ తయారీదారులు వీటిని రూపొందించారు. ఆజాదీ క్వెస్ట్ (Azadi Quest) పేరుతో ఈ గేమ్స్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటాల గురించి ఈ గేమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జింగా ఇండియా (Zynga India) సంస్థతో కలిసి ఈ గేమ్స్‌ను రూపొందించింది.


మొదట ఆజాదీ క్వెస్ట్ సిరీస్‌లో రెండు గేమ్స్ విడుదలయ్యాయి. మ్యాచ్ 3 పజిల్, హీరోస్ ఆఫ్ భారత్ పేరుతో ఈ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాళ్లతో పాటు, పోరాటయోధుల గురించి గేమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ గేమర్ల భారీ మార్కెట్‌లోకి ప్రవేశించి వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రయత్నం అని గేమ్స్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.


Samsung Mobile: ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... ఇప్పుడు రూ.10,000 లోపే
ప్రభుత్వంలోని వివిధ శాఖలు దేశం నలుమూలల నుంచి పేరు తెచ్చుకోని స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని సేకరించాయని, ఆజాదీ క్వెస్ట్ ద్వారా ఈ విజ్ఞానాన్ని అందిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం గురించి ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా అన్ని వయసులవారికి తెలిపేందుకు ఈ గేమ్‌లు రూపొందించబడ్డాయని జింగా ఇండియా హెడ్ కిషోర్ కిచ్లి తెలిపారు.


Motorola Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేఆజాదీ క్వెస్ట్ సిరీస్‌లో రిలీజైన రెండు గేమ్స్‌ను ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2022 సెప్టెంబర్ నుంచి ఈ గేమ్స్ అందుబాటులోకి వస్తాయి. గేమింగ్ రంగంలో టాప్ 5 దేశాల స్థాయికి భారతదేశం చేరిందని, 2021లో ఈ రంగం 28 శాతం అభివృద్ధి చెందిందని, 2023 నాటికి గేమర్ల సంఖ్య 45 కోట్లకు చేరుతుందని అన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, Mobile game, Pm modi, PM Narendra Modi, Video Games

ఉత్తమ కథలు