స్మార్ట్‌ఫోన్ పోతే దొరకడం కష్టం అని అనుకుంటారు. కానీ ఓ టెక్నాలజీతో పోయిన స్మార్ట్‌ఫోన్‌ను సింపుల్‌గా ట్రాక్ చేయొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీమ్యాటిక్స్ (CDoT) రూపొందించిన సెంట్రల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) టెక్నాలజీని పలు రాష్ట్రాల్లో పరీక్షించింది. ఇప్పుడు దేశమంతా ఈ టెక్నాలజీని అమలు చేస్తోంది. తాజాగా సంచార్ సాథీ పేరుతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఓ పోర్టల్ లాంఛ్ చేసింది. ఈ పోర్టల్ సాయంతో వినియోగదారులు తాము పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయొచ్చు.
స్మార్ట్‌ఫోన్ పోతే ఎవరికైనా భారంగా ఉంటుంది. ఖరీదైన ఫోన్‌తో పాటు ముఖ్యమైన డేటాను కోల్పోతుంటారు. అయితే సంచార్ సాథి పోర్టల్‌తో, మీరు ఇప్పుడు మీ మొబైల్‌ను ట్రాక్ చేయవచ్చు. మీకు చెల్లుబాటు అయ్యే భారతీయ మొబైల్ నెంబర్ ఉన్నంత వరకు సంచార్ సాథి పోర్టల్ ఉపయోగించవచ్చు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయడానికి లేదా గుర్తించడానికి ఈ పోర్టల్ CEIR ని ఉపయోగిస్తుంది.
Smartphone Under Rs 25,000: మీ బడ్జెట్ రూ.25,000 లోపేనా? ఇవే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్
ఈ పోర్టల్ ఉపయోగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా, మీ స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్ నెంబర్ తీసుకోవాలి. మీరు మీ మొబైల్ ఫోన్ ఇన్‌వాయిస్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ ఆధార్ నెంబర్ లేదా ఇతర వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీ మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడానికి లేదా ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ ఉన్న తర్వాత సంచార్ సాథీ పోర్టల్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా సంచార్ సాథీ https://ceir.sancharsaathi.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
Step 2- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ బ్లాక్ చేయడం, దొరికిన మొబైల్‌ను అన్‌బ్లాక్ చేయండి, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడం ఆప్షన్స్ ఉంటాయి.
Step 3- అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్‌పై క్లిక్ చేయండి.
Step 4- ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ తెరవబడుతుంది.
Step 5- అక్కడ మీరు మీ మొబైల్ ఫోన్ గురించి, మీ గురించి అవసరమైన డేటాను నమోదు చేయాలి.
Step 6- నెంబర్‌తో పాటు FIR కాపీని అప్‌లోడ్ చేయాలి.
Step 7- మీ మొబైల్ IMEI నెంబర్‌లను ఎంటర్ చేయాలి.
Step 8- మీ మొబైల్ బ్రాండ్‌ని ఎంచుకొని ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్ చేయాలి.
Step 9- దొంగతనం జరిగిన ప్రదేశం, తేదీ, పోలీసు ఎఫ్‌ఐఆర్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అప్‌లోడ్ చేయండి.
Step 10- మీ ప్రభుత్వ ID నంబర్, పేరు, ఇమెయిల్ ID, మొబైల్ నెంబర్, మీ వ్యక్తిగత డేటా ఎంటర్ చేయాలి.
Step 11- మీరు అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, డిక్లరేషన్‌ను గుర్తించి, సబ్మిట్ చేయాలి.
Second Hand Mobiles: సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్మి రూ.200 కోట్లు సంపాదించాడు
సంచార్ సాథీ పోర్టల్‌లో మొబైల్ బ్లాక్ చేయడం కోసం రిజిస్టర్ చేసిన తర్వాత మీ ఫోన్ దొరికినట్టైతే, అన్‌బ్లాక్ చేయడానికి, కంప్లైంట్ నెంబర్ ఎంటర్ చేసి మిగతా ప్రాసెస్ పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Smartphone