Sandes APP: వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్.. ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ కు పోటీగా అలాంటి ఫీచర్లు కలిగిన కొత్త యాప్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    వాట్సాప్ లో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి మరో కొత్త యాప్ ను తీసుకువచ్చింది. సందేశ్ గా ఆ యాప్ కు పేరు పెట్టారు. ఈ యాప్ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు వివరించారు. ఈ యప్ చాలా సురక్షితమైనదని తెలిపారు. ఈ యాప్ కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. వాట్సాప్ లో మాదిరిగా నే వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్ లో ఉండనున్నాయి. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్ వివరించారు. ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసింది. NIC తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్ ను లాంఛ్ చేశాయి.
    WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇప్పుడు ఇక ఆ సమస్య ఉండదు.. వివరాలివే..

    కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్ నంబర్ ను నమోదు చేసి, ఓటీపీని వెరిఫికేషన్ ను పూర్తి చేస్తే ఈ యాప్ ను వాడుకోవచ్చు.

    ఈ యాప్ కు సంబంధించిన కొన్ని వివరాలు..
    -ఈ యాప్ కు వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది.
    -ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.
    Published by:Nikhil Kumar S
    First published: