ఇస్రో టార్గెట్ చంద్రయాన్-3.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

Chandrayaan 3 : ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. 2020 సంవత్సరంలో ఈ భారీ ప్రయోగానికి సిద్ధమయ్యామని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు.

news18-telugu
Updated: January 1, 2020, 1:08 PM IST
ఇస్రో టార్గెట్ చంద్రయాన్-3.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
ఇస్రో చంద్రయాన్ 3... ప్రయోగం ఎప్పుడో తెలుసా...
  • Share this:
Chandrayaan 3 : ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. 2020 సంవత్సరంలో ఈ భారీ ప్రయోగానికి సిద్ధమయ్యామని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రయాన్-3 ప్రాజెక్టు ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని, ఆ ప్రాజెక్టు విలువ రూ.250 కోట్లు అని వెల్లడించారు. చంద్రయాన్‌-2 కొంత ఫలితాన్ని ఇచ్చిందని, విక్రమ్ ల్యాండర్ విజ‌య‌వంతంగా చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌లేక‌పోయినా.. ఆర్బిటార్ మాత్రం బాగా పనిచేస్తోందన్నారు. చంద్రుడి డేటాను మ‌రో ఏడేళ్ల పాటు ఆ ఆర్బిటార్ అందిస్తుందని తెలిపారు. అదే విధంగా.. ఈ సారి గగన్‌యాన్ ప్రాజెక్టును కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా, చంద్రయాన్ 3లో ఆర్బిటర్ అనేది ఉండదు. ఓన్లీ ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని తెలిసింది. చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి, ఇస్రో... చంద్రయాన్ 3లో భాగమైన ల్యాండర్‌ను ఎక్కడ దింపాలి, రోవర్‌ ఎలా ఉండాలి? వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. ఈసారి ల్యాండర్‌కి లెగ్స్ (కాళ్లు) అత్యంత బలంగా ఉండేలా చెయ్యబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే... మొన్నటి చంద్రయాన్ 2లో ల్యాండర్ కాళ్లు మరీ అంత బలమైనవేమీ కాదు. అందువల్ల అది వేగంగా పడినప్పుడు... దానికి శక్తి సరిపోలేదని అర్థమైంది. మొత్తంగా కొత్త ల్యాండర్, కొత్త రోవర్‌ను తయారు చేస్తారని తెలిసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 1, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading