హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Social Media: టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర యాప్స్

Social Media: టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర యాప్స్

Social Media: టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర యాప్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Social Media: టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర యాప్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Social Media | సోషల్ మీడియా యాప్స్, కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలు టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇండియన్ టెలికామ్ బిల్ 2022 (Indian Telecom Bill 2022) డ్రాఫ్ట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన వాట్సప్ (WhatsApp), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్‌ని భారతదేశంలో టెలికామ్ సర్వీసెస్ లైసెన్స్ (Telecom License) పరధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. సోషల్ మీడియా సంస్థలన్నీ టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వస్తే, ఇతర వినియోగదారులు అడిగినప్పుడు వారి యూజర్ల గుర్తింపును అందించడంతో సహా అనేక రకాల బాధ్యతలను ఈ కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. ఇండియన్ టెలికామ్ బిల్ 2022 (Indian Telecom Bill 2022) డ్రాఫ్ట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. వారికి అక్టోబర్ 20 వరకు అవకాశం ఉంది.

ఈ బిల్లు చట్టంగా మారితే వాట్సప్ , ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సంస్థలు తమ యూజర్ల ఐడెంటిటీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రైవసీ, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఈ సంస్థలన్నీ ఇలాంటి చర్యల్ని పట్టించుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లుతో ఈ సంస్థల నుంచి నిరసనలు వచ్చే అవకాశం ఉంది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఏదైనా ప్లాట్‌ఫామ్ ఉపయోగించే ఎవరికైనా మెసేజ్ పంపితే, సందేశం పంపిన వ్యక్తి ఐడెంటిటీ మెసేజ్ స్వీకరించిన వారికి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.

Aadhaar Card Update: మీ ఆధార్‌లో ఈ వివరాలున్నాయా? అప్‌డేట్ చేయండిలా

అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నందున సందేశాలను ట్రాక్ చేయడం సాధ్యం కాదని వాట్సప్ ఇన్నాళ్లూ వాదిస్తోంది. ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే మెసేజ్ మూలం తెలుసుకోవడం సాధ్యం కాదన్నది వాట్సప్ వాదన. కానీ ఈ బిల్లుకు ఆమోదముద్రపడితే ఇకపై మెసేజ్ మూలాన్ని తెలపాల్సిన బాధ్యత వాట్సప్‌పై ఉంటుంది. అంటే ఆ మెసేజ్ మొదట ఎవరు సృష్టించారని గుర్తించగలగాలి.

భారతీయ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ని రీప్లేస్ చేయడానికి ప్రస్తుతం ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఓటీటీలు, సోషల్ మీడియా దిగ్గజాలు, ఈ తరం శాటిలైట్, ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ కంపెనీలు భారతదేశ అభివృద్ధి చెందుతున్న టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ముఖ్యమైనవిగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇవన్నీ లైసెన్స్‌తో పనిచేయాలన్నది ప్రభుత్వం అభిప్రాయం.

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ మీ మొబైల్‌లో ఇలా డౌన్‌లోడ్ చేయండి

కేవలం మెసేజెస్ మాత్రమే కాదు బ్రాడ్‌క్యాస్టింగ్ సేవలు, ఎలక్ట్రానిక్ మెయిల్, వాయిస్ మెయిల్, వాయిస్ మెసేజ్, వీడియో, డేటా కమ్యూనికేషన్ సర్వీసెస్, ఆడియోటెక్స్ సర్వీసెస్, వీడియోటెక్స్ సర్వీసెస్, ఫిక్స్‌డ్ మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు, ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు, ఇన్‌ఫ్లైట్, మారిటైమ్ కనెక్టివిటీ సేవలు, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ సేవలు, మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్ సేవలు, ఓటీటీ సేవలన్నీ టెలీకమ్యూనికేషన్ పరిధిలోకి రానున్నాయి.

టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేయడానికి ఒక సంస్థకు లైసెన్స్ మంజూరు చేసే పూర్తి విచక్షణాధికారం కేంద్రానికి ఉంటుందని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Facebook, Instagram, Whatsapp

ఉత్తమ కథలు