Home /News /technology /

CENTRAL CABINET NOD TO 2251 25 MHZ 5G SPECTRUM AUCTION BY MARCH BA

5G Spectrum Auction: 5జీ స్ప్రెక్ట్రమ్ వేలానికి ముహూర్తం ఖరారు, రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చిలో 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

    మార్చిలో 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో స్ప్రెక్ట్రమ్ వేలం కూడా ఒకటి. 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz , 2500 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌లో మొత్తం 20 సంవత్సరాలకు స్ప్రెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మొత్తం 2251.25 MHz వేలం వేయనున్నట్టు చెప్పారు. దీని ద్వారా రూ. 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 5జీ స్ప్రెక్ట్రమ్ కొనుగోలు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఈనెలలోనే పిలుస్తారు. మార్చి నాటికి వేలం ప్రక్రియను పూర్తి చేస్తారు. మొత్తం మూడు రకాలైన స్ప్రక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. అలాగే, టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌లో నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఏర్పాటు చేయాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల కోసం నమ్మకమైన, సర్వీసుదారులను, ఉత్పత్తుల జాబితాను కేంద్రం ప్రకటించనుంది.

    మరోవైపు చెరకు రైతులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతి చేసే వారికి టన్నుకు రూ.6000 చొప్పున సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు. దీని వల్ల 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది సుగర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు లాభం జరుగుతుందని అంచనా వేశారు. రైతులకు మూడు విడుతల్లో ఈ సబ్సిడీని అందిస్తారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: 5G

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు