CENTER RULES ON 5G TECHNOLOGY WITH THE NEW RULES THE AVAILABILITY OF 5G SMARTPHONES IN THE COUNTRY IS LIKELY TO DECREASE GH VB
5G Smartphones: 5G టెక్నాలజీపై కేంద్రం కొత్త నిబంధనలు.. ఆ కొత్త రూల్స్ ఏవంటే..
ప్రతీకాత్మక చిత్రం
జనవరి1, 2023 నుంచి దేశంలో 5జీ డివైజ్‌లను లోకల్ టెస్టింగ్, సర్టిఫికేషన్ చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు పేర్కొంది. దీని బట్టి 5జీ ఫోన్లు దేశంలో విక్రయించడానికి ముందు లోకల్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
దేశంలో 5G స్మార్ట్ ఫోన్ల(5G Smart Phones) లభ్యత తగ్గే అవకాశం ఉందని ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియో, వీఐ తమ కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్(Economics Times) నివేదిక ప్రకారం.. జనవరి1, 2023 నుంచి దేశంలో 5జీ డివైజ్‌లను లోకల్ టెస్టింగ్(Local Testing), సర్టిఫికేషన్ చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు పేర్కొంది. దీని బట్టి 5జీ ఫోన్లు దేశంలో విక్రయించడానికి ముందు లోకల్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నది నివేదిక సారాంశం. ఈ విషయంపై టాప్ టెలికాం ప్రొవైడర్లు, టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) పలు హెచ్చరికలు చేసింది. 5G ఫోన్లల లోకల్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ వల్ల డేటా వినియోగాన్ని తగ్గిస్తుందని, మార్కెట్ యాక్సెస్‌ను పరిమితం చేస్తుందని హెచ్చరించింది.
న్యూ 5జీ ఫోన్లను కొనుగోలు చేయకుండా వినియోగదారులను దూరం చేస్తుందని పేర్కొంది. టెలికామ్ ప్రొవైడర్లు కూడా ఈ చర్యపై పెదవి విరిచారు. లోకల్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తే..గ్లోబల్ హ్యాండ్సెట్ తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ ఆశయాలకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది.
మ్యాండేటరీ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ టెలికాం ఎక్విప్మెంట్ (MTCTE) మార్గదర్శకాల్లోని 5వ దశ కిందకు 5జీ ఫోన్లను తీసుకురావాలని DoT సాంకేతిక విభాగమైన టెలికాం ఇంజనీరింగ్ సెంటర్ (TEC) ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. దేశంలో అమ్మే ఎలక్ట్రానిక్ పరికరాల టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ తప్పనిసరి ప్రక్రియను MTCTE చూసుకుంటుంది. 5G ఫోన్ల కోసం MTCTE 5వ దశ జనవరి 2023 నుండి ప్రారంభం కానుంది.
స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు సైతం దేశంలో విక్రయించే ముందు పరీక్షించి, స్థానికంగా సర్టిఫై చేయనున్నారు. దీనిపై TEC నిర్ణయం తీసుకున్న వెంటనే ఇది అమల్లోకి రానుంది. మరోపక్క టెలికాం ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ లోకల్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అమలు ప్రక్రియను నిలిపివేయాలని DoTని కోరారు.
MTCTE సర్టిఫికేషన్ ప్రక్రియలో అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కవర్ అయ్యేలా ఉన్న నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా MTCTE ఫేజ్ 3 కింద 5జీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కెమెరాలను కొనసాగించడాన్ని నిరోధించే విధంగా TECని ఆదేశించాలని కోరింది.
ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
5G స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం వివిధ ధరల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జనవరి, 2022లో ప్రపంచవ్యాప్తంగా 51 శాతానికి చేరుకున్నాయని కౌంటర్ పాయింట్ ఓ నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా చైనా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో అమ్మకాల వృద్ధి పెరిగిందని నివేదిక పేర్కొంది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 84 శాతం మార్కెట్‌తో చైనా అత్యధికంగా 5G వ్యాప్తిని కలిగి ఉంది. 5జీ ఫోన్ల అమ్మకాల వృద్ధి కోసం చైనీస్ టెలికాం ఆపరేటర్లు స్మార్ట్ ఫోన్లను OEM విధానంలో వినియోగదారులకు సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దీంతో చైనాలో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరందుకోవడానికి ఇది ప్రధాన కారణమైందని నివేదికలో పేర్కొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.