కారు కొనాలనుకునే వారిలో చాలామంది తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు, ఎక్కువ మైలేజీ ఇచ్చే వాటి కోసం వెతుకుతుంటారు. అలాంటి కార్లు ఎన్ని మోడల్స్ ఉన్నాయి.. ఏయే కంపెనీల్లో తమకు కావాల్సిన బడ్జెట్ కార్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తుంటారు. అలా మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? అయితే, రూ .8 లక్షలలోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.
టాటా నెక్సాన్
టాటా మోటార్స్ యొక్క ఈ ప్రీమియం కారు రూ .6.99 లక్షలకు లభిస్తుంది. టాటా నెక్సాన్ కారు ప్రారంభంలోనే భారతీయ మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇది 1.2- లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు120 పిఎస్ శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్నును ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ కారు రూ .6.75 లక్షలకు లభిస్తుంది. ఈ కారు మొత్తం మూడు ఇంజన్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది120 పిఎస్ శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్నును ఉత్పత్తి చేస్తుంది.
కియా సోనెట్
కియా కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ కారు రూ .6.71 లక్షలకు లభిస్తుంది. ఈ కారు అత్యధిక సంఖ్యలో ఇంజిన్-ట్రాన్స్మిషన్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది. దీనిలో టర్బో-పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 120 పిఎస్ శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్యును ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300
మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కారు రూ .7.94 లక్షలకు లభిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 రెండూ దాదాపు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 116 పిఎస్ శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వోక్స్ వ్యాగన్ పోలో
వోక్స్ వ్యాగన్‌కు చెందిన ఈ కారు రూ .5.92 లక్షలకు లభిస్తుంది. వోక్స్ వ్యాగన్ పోలో 1-లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో వస్తుంది. ఇది 110 పిఎస్ శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్స్ను ఉత్పత్తి చేస్తుంది.
స్కోడా రాపిడ్ టిఎస్ఐ
స్కోడా రాపిడ్ ఇటీవలే భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కారు రూ .7.49 లక్షలకు లభిస్తుంది. స్కోడా రాపిడ్ టిఎస్ఐ 1-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 108 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకికి కంపెనీకి చెందిన విటారా బ్రెజ్జా కారు రూ .7.34 లక్షలకే లభిస్తుంది. ఇటీవలే విటారా బ్రెజ్జా కొత్త BS-VI నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజన్- నుంచి పెట్రోల్ ఇంజన్‌కు మారింది. ఈ కారు1.5- లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 108 పిఎస్ శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి చెందిన మరో మిడ్‌రేంజ్ కారు అయిన ఎర్టిగా రూ .7.59 లక్షలకే లభిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 103 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
హోండా అమేజ్
హోండా కంపెనీకి చెందిన ఈ కారు రూ .6.19 లక్షలకు లభిస్తుంది. హోండా అమేజ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు గల రెండు ఇంజన్లను కలిగి ఉంది. మాన్యువల్ గేర్‌బాక్స్1.5- లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 100 పిఎస్ శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫోర్డ్ ఆస్పైర్
ఫోర్డ్ కంపెనీకి చెందిన ఈ కారు రూ .6.09 లక్షలకు లభిస్తుంది. ఫోర్డ్ ఆస్పైర్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు 100 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేయగలదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Cars