ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రైడల్ ఫోటోషూట్ పిక్స్ అప్లోడ్ చేసింది. ఆమె ఫాలోయర్లు అంతా షాకయ్యారు. క్యాన్సర్‌కు చికిత్సతో జుట్టంతా ఊడిపోయినా ఏమాత్రం కుంగిపోకుండా పెళ్లికూతురిలా ముస్తాబై ఫోటోలు దిగింది.
క్యాన్సర్... ఈ ప్రాణాంతక జబ్బు మనిషిని శారీరకంగానే కాదు... మానసికంగానూ కుంగదీస్తుంది. మనస్సులో అంతా ఏదో తెలియని ఆందోళన, ఒత్తిడి, భయం వెంటాడుతూ ఉంటాయి. వాళ్ల బాధ వర్ణణాతీతం. కానీ ఓ యువతి తనకు క్యాన్సర్ వచ్చిందన్న బాధను దిగమింగి ఇతర క్యాన్సర్ పేషెంట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె పేరు వైష్ణవి పూవనేంద్రన్. నవి ఇంద్రాన్ పిల్లై పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటుంది. వయస్సు కేవలం 22 ఏళ్ల వయస్సులో 2013లో థర్డ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. పలు కీమో థెరపీ సెషన్ల తర్వాత 2015లో క్యాన్సర్ నుంచి బయటపడింది. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. గతేడాది చెక్-అప్ చేయిస్తే మళ్లీ క్యాన్సర్ జబ్బు బారినపడ్డట్టు తేలింది. బాధతో కుంగిపోవడం కన్నా... జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంది ఆ యువతి. ప్రస్తుతం ఆమె వయస్సు 28 ఏళ్లు. క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్న తను ఎంత సంతోషంగా ఉందో తెలుసుకోవాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూడాలి.
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రైడల్ ఫోటోషూట్ పిక్స్ అప్లోడ్ చేసింది. ఆమె ఫాలోయర్లు అంతా షాకయ్యారు. క్యాన్సర్‌కు చికిత్సతో జుట్టంతా ఊడిపోయినా ఏమాత్రం కుంగిపోకుండా పెళ్లికూతురిలా ముస్తాబై ఫోటోలు దిగింది.
క్యాన్సర్‌కు చికిత్స చేయించుకోవడం మాకు చాలా పరిమితుల్ని విధిస్తుంది. మా అందాన్ని కాజేసుకుంటుంది. మా విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. పెళ్లి ఎలా ఉంటుందో, పెళ్లికూతురులా ముస్తాబైతే ఎలా కనిపిస్తామోనని చిన్నప్పటి నుంచి గురించి కలలు కంటాం. కానీ ఆ కలలు నెరవేర్చుకోకముందే క్యాన్సర్ మా కలల్ని చిన్నాభిన్నం చేస్తుంది. చాలామంది క్యాన్సర్ వల్ల తమ పెళ్లిని రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో తప్పదు.
— నవి ఇంద్రాన్ పిల్లై, క్యాన్సర్ చికిత్స పొందుతున్న యువతి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.