మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

    Phone Virus: స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్స్ గుర్తించడం ఎలా..? వీటి నుంచి డివైజ్‌లను ఎలా కాపాడుకోవాలి..?

    Phone Virus: స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్స్ గుర్తించడం ఎలా..? వీటి నుంచి డివైజ్‌లను ఎలా కాపాడుకోవాలి..?

    ప్రతీకాత్మక చిత్రం

    ప్రతీకాత్మక చిత్రం

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పది మొబైల్స్‌లో నాలుగు సైబర్ దాడులకు గురవుతున్నాయి. అయితే మీ ఫోన్‌ మాల్వేర్, వైరస్ బారిన పడినట్లు ఎలా గుర్తించాలి? ఒకవేళ ఫోన్‌లో వైరస్‌ ఉన్నట్లు గుర్తిస్తే ఏం చేయాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

    ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీపై(Digital Technology) ప్రభుత్వాలు(Governments)దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ల(Mobile Phones) వాడకం గత కొన్నేళ్లలో భారీగా పెరిగింది. అయితే వీటితోపాటే స్మార్ట్‌ఫోన్లలో వైరస్‌ను(Virus) చొప్పించి మోసాలకు పాల్పడుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ(Cyber Security) కంపెనీ Kaspersky నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొబైల్ ఫోన్ వినియోగదారులపై దాదాపు 3.5 మిలియన్ల అటాక్స్ జరిగాయి. మన ఫోన్లకు మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చే స్పామ్ మెసేజ్‌లకు వైరస్‌లకు లింక్‌ ఉంటుంది. ఇవి ఒక రకమైన హానికరమైన సాఫ్ట్‌వేర్(మాల్వేర్)గా చెప్పుకోవచ్చు. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే మాల్‌వేర్.. యూజర్లకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే అవకాశం ఉంది. మొబైల్ డివైజ్‌లలో ఐదవ వంతు కంటే ఎక్కువ భాగం మాల్వేర్‌ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పది మొబైల్స్‌లో నాలుగు సైబర్ దాడులకు గురవుతున్నాయి. అయితే మీ ఫోన్‌ మాల్వేర్, వైరస్ బారిన పడినట్లు ఎలా గుర్తించాలి? ఒకవేళ ఫోన్‌లో వైరస్‌ ఉన్నట్లు గుర్తిస్తే ఏం చేయాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

    ఇదీ చదవండి : ఈ నగరానికి ఏమైంది..? మొన్న చాక్లెట్లు.. ఇప్పుడు మత్తు ఇంజక్షన్లు..

    * వైరస్ ప్రమాదాన్ని ఇలా గుర్తించండి

    నిజానికి స్మార్ట్‌ఫోన్‌కు వైరస్ లేదా మాల్‌వేర్ సోకిందో లేదో చెప్పడం అంత సులభం కాదు. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా వైరస్ ఉనికిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

    - యాప్‌లు ఓపెన్ అవ్వడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకోవడం లేదా సడన్‌గా యాప్స్ క్రాష్ కావడం, పేలవమైన పనితీరు ఉంటే అనుమానించాల్సిందే.

    - ఫోన్‌లో మాల్వేర్ ఉంటే, అది ప్రతి నిమిషం పనిచేస్తూనే ఉంటుంది. దీంతో ఫోన్ బ్యాటరీ ఎక్కువగా డ్రెయిన్ అవుతుంది.

    - బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్వేర్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి మొబైల్ డేటా వినియోగం పెరుగుతుంది.

    - మాల్వేర్ కారణంగా డేటా ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో బిల్లింగ్ ఛార్జీలు పెరగవచ్చు.

    - పాప్-అప్‌ నోటిఫికేషన్స్ తేడాగా ఉంటే అప్రమత్తం అవ్వాలి.

    - స్పైవేర్స్ ఎప్పుడూ ఆఫ్ అవ్వవు కాబట్టి, ఫోన్ ఎక్కువగా వేడెక్కుతోంది. ఫోన్ యూజ్ చేయకపోయినా ఎక్కువగా హీట్ అయితే, అందులో వైరస్ ఉందేమో చెక్ చేయాలి.

    * మీ డివైజ్‌కు వైరస్ సోకిందని అనుమానిస్తే.. తీసుకోవలసిన జాగ్రత్తలు..

    ఫోన్‌కు మరింత డ్యామేజీ జరగకుండా చూడాలంటే, దాని నుంచి మాల్వేర్‌ను తీసివేయాలి. దీన్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం.

    - మాల్వేర్ ఉనికిని గుర్తించేందుకు ఫోన్‌ను స్కాన్ చేయాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మంచి యాంటీవైరస్ యాప్‌ను యూజ్ చేయాలి. అవాస్ట్, AVG, Bitdefender, McAfee, Norton వంటి ప్లాట్‌ఫామ్స్ పేమెంట్, ఫ్రీ సర్వీస్‌లు అందుబాటులో ఉంచాయి. ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

    - ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోన్ స్టోరేజ్, క్యాచీని.. యాపిల్ డివైజ్‌లలో బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్‌సైట్ డేటాను క్లియర్ చేయండి.

    Facebook Features: రెండు పాపులర్ ఫీచర్లను శాశ్వతంగా తొలగించిన ఫేస్‌బుక్.. కారణం ఏంటంటే..


    - మీ డివైజ్‌లను రీస్టార్ట్ చేయండి. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో సేఫ్ మోడ్ ఆన్ చేయండి. ఇలా చేస్తే థర్డ్-పార్టీ యాప్‌లు ఆపరేట్ చేయకుండా ఆండ్రాయిట్ కంట్రోల్ చేస్తుంది.

    - ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన యాప్‌లలో ఏవైనా అనుమానాస్పదంగా లేదా తెలియని యాప్‌లు ఉంటే.. వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే.. యాప్‌లను డిలీట్ చేసిన తర్వాత సేఫ్ మోడ్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.

    - చివరి ప్రయత్నంగా మీ డేటాను బ్యాకప్ చేసుకొని, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. ఒరిజినల్ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయడం వల్ల ఏదైనా మాల్వేర్ ఉంటే డిలీట్ అయిపోతుంది.

    * ఈ జాగ్రత్తలు పాటించండి..

    - డివైజ్‌లను వైరస్‌లు, ఇతర సెక్యూరిటీ రిస్క్ నుంచి రక్షించుకోవడానికి యాంటీవైరస్ యాప్స్ సేవలను వినియోగించుకోవాలి.

    - స్పామ్ మెసేజ్‌లలోని లింక్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు, ఇమెయిల్‌లలోని లింక్‌లను క్లిక్ చేయకుండా జాగ్రత్తపడాలి.

    - గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    - మీ డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేస్తూ, ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి.

    First published:

    Tags: 5g smart phone, Anti virus, Malware, Mobile phones, Software, Virus

    ఉత్తమ కథలు