టెక్ దిగ్గజం గూగుల్ (Google) అన్ని కాల్ రికార్డర్ యాప్స్‌ను (Call Recording Apps) బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మే 11 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే మరికొద్ది గంటల్లో కాల్ రికార్డర్(Call Recorder) యాప్‌లన్నీ నిరుపయోగంగా మారిపోతాయి. ఈ తేదీ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో(Smartphones) కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీని అందించే యాక్సెసిబిలిటీ ఏపీఐ (API)ని యాప్ డెవలపర్లు యాక్సెస్ చేయలేరు. యూజర్లకు మెరుగైన ప్రైవసీ (Better Privacy) అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే రేపటి నుంచి థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయడం ఆగిపోయినా... కాల్స్‌ను రికార్డు చేయడం యూజర్లకు అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే కొన్ని ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా ఉంటుంది. దీని సాయంతో మే 11 తర్వాత కూడా యూజర్లు యథావిధిగా తమ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. మరి కాల్ రికార్డింగ్ ఫీచర్‌కు మద్దతు ఇచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
షియోమీ, రెడ్మీ, ఎంఐ
షియోమీ బ్రాండ్ తన స్మార్ట్ఫోన్లలో కస్టమైజ్డ్ MIUI ఇంటర్ఫేస్ను అందిస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ కాల్ రికార్డర్ ఫీచర్ ఉంటుంది. అందువల్ల ఈ ఫోన్ యూజర్లు ప్రత్యేకంగా కాల్ రికార్డర్ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్లు కాల్ ఇంటర్‌ఫేస్‌కి వెళ్లి కాల్ రికార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. ఆ రికార్డ్ ఫైల్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. రెడ్మీ, ఎంఐ స్మార్ట్ఫోన్ల యూజర్లు కూడా కాల్స్ రికార్డ్ చేయవచ్చు.
Business Idea: ఈ బిజినెస్ కు సర్కార్ సాయం.. లక్షల కొద్దీ ఆదాయం.. తెలుసుకోండి
శాంసంగ్
శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లలో OneUI ఇంటర్ఫేస్ను అందిస్తుంది. ఈ కంపెనీ స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్లో లేని ఫీచర్లను స్మార్ట్ఫోన్లలో ఆఫర్ చేస్తుంది. కాల్ రికార్డర్ ఫీచర్ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అయి ఉంటుంది. లేదంటే మీరు ఫోన్లోని సెట్టింగ్స్ లో కాల్ రికార్డర్ ఫీచర్ ఎనేబుల్ చేయొచ్చు.
ఒప్పో
ఒప్పో చాలా స్మార్ట్ఫోన్లలో కలర్ఓఎస్ వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. ఈ వెర్షన్‌లోని కాలింగ్ యాప్‌లో కాల్ రికార్డర్ ఫీచర్‌ను అందిస్తుంది. యాప్ మైక్రోఫోన్ యాక్సెస్‌ని అడుగుతుంది, తద్వారా ఇది ఆడియోను రికార్డ్ చేస్తుంది. ఫొన్లో కాల్ రికార్డింగ్ ఫైల్‌ను స్టోర్ చేయడానికి మీడియాను యాక్సెస్ చేస్తుంది.
పోకో
పోకో ఫోన్లు MIUI వెర్షన్ సాయంతో కూడా రన్ అవుతాయి. కాబట్టి, ఇన్‌బిల్ట్ కాల్ రికార్డర్ ఆప్షన్ ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్
వన్‌ప్లస్ తన స్మార్ట్ఫోన్లలో OxygenOS సాఫ్ట్వేర్ ఆఫర్ చేస్తోంది. ఈ ఓఎస్ లో కాల్ రికార్డర్ ఫీచర్ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు యూజర్లు కాల్ రికార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి తమ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు.
రియల్మీ
రియల్మీ స్మార్ట్ఫోన్లు RealmeUI వెర్షన్‌తో వస్తాయి. యూజర్లు తమ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీని సులభంగా ఎనేబుల్/డిజేబుల్ చేయవచ్చు.
వివో
వివో Funtouch ఓఎస్ ని అందిస్తుంది. వివో స్మార్ట్ఫోన్లలో కాల్లు చేసేటప్పుడు కాల్ రికార్డర్ ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించవచ్చు.
టెక్నో
టెక్నో స్మార్ట్ఫోన్లు వేరొక ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్లో కూడా రన్ అవుతాయి. కంపెనీ కాల్ రికార్డర్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫీచర్ మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వాయిస్ కాల్లకు ఆటోమేటిక్‌గా రికార్డు అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, 5g technology, Mobile phones, Technology