వీడియో గేమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. పబ్‌జీకి పోటీగా మరో గేమ్ రిలీజైంది. 'కాల్ ఆఫ్ డ్యూటీ'ని రిలీజ్ చేసింది టెన్సెంట్. పబ్‌జీ గేమ్ రూపొందించింది కూడా ఈ కంపెనీనే. ఇప్పుడు అదే కంపెనీ 'కాల్ ఆఫ్ డ్యూటీ' వీడియో గేమ్ రిలీజ్ చేయడం విశేషం. 'కాల్ ఆఫ్ డ్యూటీ-మొబైల్' ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి యూరప్, అమెరికాలో మాత్రమే ఈ గేమ్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందన్న స్పష్టత లేదు.
'కాల్ ఆఫ్ డ్యూటీ'ని టెన్సెంట్‌కు చెందిన టిమి స్టూడియో, యాక్టివిజన్ డెవలప్ చేయడం విశేషం. మల్టీప్లేయర్ ఎక్స్‌పీరియెన్స్ ఈ గేమ్ ప్రత్యేకత. వాస్తవానికి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ పీసీ, కన్సోల్స్ కోసం రూపొందించారు. ఇప్పుడు మొబైల్ వర్షన్ రిలీజ్ చేయడం విశేషం. ఇప్పటికే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
ఇవి కూడా చదవండి:
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్
WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, PUBG, Smartphone, Video Games