Home /News /technology /

CAB BOOKING HOW TO BOOK UBER CAR RIDE IN WHATSAPP APP FOLLOW THIS STEP BY STEP PROCESS GH SK

WhatsApp- Uber Rides: వాట్సప్‌లో ఉబెర్ కారును బుక్ చేసుకోవడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uber Cab Booking in Whatsapp: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ (Uber) తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా ఈ సంస్థ వాట్సాప్‌ (WhatsApp)లోనే ఉబెర్ క్యాబ్ (Uber Cab) బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ యూజర్లకు కల్పించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ (Uber) తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా ఈ సంస్థ వాట్సాప్‌ (WhatsApp)లోనే ఉబెర్ క్యాబ్ (Uber Cab) బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ యూజర్లకు కల్పించింది. ఇప్పుడు యూజర్లు ఉబెర్ యాప్ డౌన్‌లోడ్/ఓపెన్ చేయాల్సిన అవసరమే లేకుండా వాట్సాప్ ద్వారానే రైడ్‌లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ సేవ లక్నో యూజర్లకు ఇంతకుముందే అందుబాటులోకి రాగా ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. యూజర్ రిజిస్ట్రేషన్, రైడ్ బుక్ చేయడం, ట్రిప్ రసీదు పొందడం నుంచి ప్రతిదీ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారానే రైడర్లు పూర్తి చేయవచ్చు. దీనివల్ల బుకింగ్ ప్రాసెస్ చాలా త్వరగా, సింపుల్‌గా అయిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ సింపుల్‌గా అనిపించినా, వాట్సాప్‌లో క్యాబ్‌ను బుక్ చేసే విషయంలో కొందరు అందరు గోళం గా ఫీల్ అవ్వచ్చు. అలాంటి వారి కోసం వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్ బుక్ చేసుకోవడం ఎలా? అనేది స్టెప్-బై-స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఉబెర్ కొత్తగా తీసుకొచ్చిన సదుపాయంతో కొన్ని సెకన్లలో వాట్సాప్‌లో ఉబెర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ఉబెర్ యాప్‌లోలాగా రిజిస్ట్రేషన్, లాగిన్ వంటి లాంగ్ ప్రాసెస్‌లు అనుసరించాల్సిన అవసరం లేదు. జస్ట్, వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేసి పికప్, డ్రాప్-ఆఫ్ డెస్టినేషన్ వివరాలు అందిస్తే సరిపోతుంది.

* వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్‌ను ఎలా బుక్ చేసుకోవాలి
- మొదటగా ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేసి +91 7292000002 వాట్సాప్ నంబర్‌కి ‘Hi’ లేదా ‘Hi Uber’ అని పంపించాలి. లేదా ఉబెర్ ఇచ్చిన QR కోడ్‌ని ఫోన్ కెమెరా యాప్ నుంచి స్కాన్ చేయవచ్చు.
- ఆ తర్వాత భాషను ఎంచుకుని పికప్, డ్రాప్-ఆఫ్ లొకేషన్ వివరాలను సెండ్ చేయాలి.
- రైడ్ కోసం ఎంత చెల్లించాలో ఒక ఎక్స్‌పెక్టెడ్ ఛార్జీని వాట్సాప్ చాట్‌ బాట్ చూపిస్తుంది.
- చివరగా ఫోన్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని టైప్ చేసి మీ రైడ్‌ను కన్ఫాం చేయాల్సి ఉంటుంది.



సమీపంలో ఉన్న ఉబెర్ డ్రైవర్ రైడ్ అభ్యర్థనను అంగీకరించిన వెంటనే, వాట్సాప్‌లోనే ఒక నోటిఫికేషన్ అందుతుంది. ఆ తర్వాత రైడ్ వివరాలను వాట్సాప్ చాట్‌లో ట్రాక్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌తో సైన్ అప్ చేసి ఉంటేనే... వాట్సాప్ ద్వారా రైడ్‌ను బుక్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. రైడ్‌ని బుక్ చేసుకోవడానికి ఈమెయిల్/పాస్‌వర్డ్ పద్ధతిని ఉపయోగించేవారు ఈ ఫీచర్‌ని వాడలేరని గమనించాలి. ముందుగా చెప్పినట్లు, ఈ ఫీచర్ ప్రస్తుతం ఢిల్లీ NCR ప్రాంతంలో బుక్ చేసే రైడ్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ముంబై, బెంగళూరు వంటి నగరాలతో సహా ఇతర ప్రాంతాలలో కూడా ఉబెర్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఉబెర్ వాట్సాప్‌లో ఇంగ్లీష్, హిందీ భాషలకు కూడా సపోర్ట్ చేస్తుంది. యూజర్లు తమకు నచ్చిన భాషలోనే వివరాలను అందించి రైడ్ బుక్ చేసుకోవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Technology, Uber, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు