BY END OF 2021 GOOGLE WILL AUTO ENROL USERS IN TWO STEP VERIFICATION SU GH
Google: గూగుల్ అకౌంట్లకు మరింత భద్రత.. హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు త్వరలోనే టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్
ప్రతీకాత్మక చిత్రం
యూజర్ల భద్రతే లక్ష్యంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేయకుండా నిరోధించనుంది.
యూజర్ల భద్రతే లక్ష్యంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేయకుండా నిరోధించనుంది. 2021 చివరి నాటికి ఆటో ఎన్రోల్ టూ స్టెప్ వెరిఫికేషనన్ అమలు చేయాలని భావిస్తోంది. సాధారణంగా గూగుల్ అకౌంట్లోకి మన రెగ్యులర్ డివైజెస్‌లో కాకుండా వేరే డివైజ్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే రెగ్యులర్ మొబైల్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అది మీరేనని కన్ఫర్మ్ చేస్తేనే అకౌంట్లోకి లాగిన్ అవుతుంది. అయితే ఈ ప్రక్రియలో కూడా హ్యాకర్లు చొరబడే అవకాశం ఉందని గూగుల్ గుర్తించింది. అందుకే ఇక మీదట ఈ వెరిఫికేషన్ ప్రక్రియను రెండు దశల్లో జరపాలని నిర్ణయించింది.
హ్యాకర్లు సైతం గూగుల్ అకౌంట్‌ను ట్రేస్ చేయలేని విధంగా ఈ కొత్త విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్ల డేటా భద్రత కోసం గూగుల్ స్మార్ట్ లాక్ యాప్, గూగుల్ ఐడెంటిటీ సర్వీసెస్ వంటి అదనపు సెక్యూరిటీ టూల్స్‌ని కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
స్వయంగా సెల్ఫ్ వెరిఫికేషన్
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పేరుతో ఈ సెక్యూరిటీ ఫీచర్‌ను చాలా కాలం క్రితమే గూగుల్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్రా గూగుల్ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూజర్ సెట్టింగుల ద్వారా పొందాల్సి వస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, యూజర్ అవసరం లేకుండా గూగులే ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. 2021 చివరి కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లకు సైతం దీన్ని అందుబాటులోకి తేనుంది.
యూజర్లందరూ తమ యూట్యూబ్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. మొదటిసారిగా డివైజ్‌లోకి లాగిన్ అయ్యే యూజర్లకు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.