పవర్ బ్యాంక్... స్మార్ట్‌ఫోన్ ఉన్నవారందరికీ తప్పనిసరి అయిపోయింది ఈ రోజుల్లో. కారణం... స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సరిపోకపోవడమే. ఉదయం ఫుల్ ఛార్జింగ్ పెట్టినా సాయంత్రానికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దీంతో ఛార్జింగ్ కోసం తిప్పలు పడాల్సివస్తుంది. అందుకే బ్యాగులో లేదా జేబులో పవర్ బ్యాంక్ ఉండాల్సిందే. మరి మీరు కూడా పవర్ బ్యాంక్ వాడుతున్నారా? లేదా పవర్ బ్యాంక్ కొనాలని అనుకుంటున్నారా? మరి పవర్ బ్యాంక్ కొనే ముందు చూడాల్సిన అంశాలేంటో తెలుసా? అసలు పవర్ బ్యాంక్ కెపాసిటీ ఎలా లెక్కించాలి? తెలుసుకోండి.
Read this: RRB NTPC Jobs: 35,277 పోస్టులు... దరఖాస్తు చేసుకోండి ఇలా...
పవర్ బ్యాంక్ బాక్స్ పైన ఉన్న కెపాసిటీకి అసలు కెపాసిటీకి చాలా తేడా ఉంటుంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. తమ దగ్గర 4000 ఎంఏహెచ్ స్మార్ట్‌ఫోన్ ఉందంటే 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకుతో ఐదు సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ పవర్ బ్యాంక్ కెపాసిటీని లెక్కించే పద్ధతి అది కాదు. కన్వర్షన్ లాస్ ఉంటుంది. సాధారణంగా మీ స్మార్ట్‌ఫోన్ పవర్ రేటింగ్‌ను 5 వోల్ట్స్‌తో లెక్కిస్తారు. కానీ పవర్ బ్యాంకు విషయానికి వచ్చేసరికి 3.7 వోల్ట్స్ మాత్రమే లెక్కిస్తారు. దీనివల్ల కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీ పవర్ బ్యాంక్ కెపాసిటీ 10,000 ఎంఏహెచ్ అనుకుందాం. 10,000 ఎంఏహెచ్ x 3.7 వోల్ట్స్= 37,000 మెగావాట్ హవర్స్. దీన్ని 5 వోల్ట్స్‌కి కన్వర్ట్ చేస్తే మీ స్టోర్డ్ కెపాసిటీ 7,400 ఎంఏహెచ్(37,000 మెగా వాట్ హవర్స్ / 5 వోల్ట్స్) మాత్రమే. అంటే మీరు 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ కొంటే అందులో మీకు లభించే కెపాసిటీ 7,400 ఎంఏహెచ్. 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ కొంటే 14,800 ఎంఏహెచ్ కెపాసిటీ లభిస్తుంది. ఇలా లెక్కలు వేయడంలో కన్ఫ్యూజన్ ఉంటే మీరు సింపుల్‌గా పవర్ బ్యాంక్ కెపాసిటీలో ఓ పాతిక శాతం తక్కువగా ఉంటుందని అర్థం చేసుకుంటే చాలు.
Read this: Personal Finance: అకౌంట్లో ఎక్కువ వడ్డీ ఇచ్చే 'ఆటో స్వీప్' గురించి మీకు తెలుసా?
పవర్ బ్యాంకు ద్వారా ఎన్ని ఫోన్లు ఛార్జింగ్ చేయొచ్చో కూడా చూడాలి. కొన్ని పవర్ బ్యాంకులు ఒకేసారి మూడు ఫోన్లు ఛార్జింగ్ చేసేలా పోర్టులు ఉంటాయి. అందుకే పవర్ బ్యాంకులో పోర్టుల సంఖ్య కూడా చూడాలి. అంతేకాదు ఓవైపు పవర్ బ్యాంకును ఛార్జ్ చేస్తూ, పవర్ బ్యాంకు నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసే ఫీచర్స్ ఉన్న పవర్ బ్యాంక్ ఎంచుకోవడం మంచిది. దాంతో పాటు ఛార్జింగ్ స్పీడ్ కూడా ముఖ్యమే. ఈ స్పీడ్‌ను 1A, 2A అని లెక్కిస్తారు. 2A మీ ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేస్తుంది.
Read this: Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
పవర్ బ్యాంక్ సైజు కెపాసిటీతో సంబంధం ఉండదు. కెపాసిటీ తక్కువ ఉన్న పవర్ బ్యాంకు సైజు పెద్దగా ఉండొచ్చు. కెపాసిటీ ఎక్కువగా ఉన్న పవర్ బ్యాంకు సైజు తక్కువగా ఉండొచ్చు. అయితే కెపాసిటీ ఎక్కువ, బరువు తక్కువ ఉన్న పవర్ బ్యాంకులు ఎంచుకుంటేనే మంచిది. క్రెడిట్ కార్డ్ సైజ్ పవర్ బ్యాంకులు కూడా ఉంటాయి. జర్నీలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ బరువైన పవర్ బ్యాంకు తీసుకుంటే మొదట్లో ఇబ్బంది అనిపించదు కానీ... తర్వాత చికాకు తప్పదు.
Read this: LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
మీరు కొనే పవర్ బ్యాంకుకు కంపెనీ వారెంటీ ఎంత సమయం ఇస్తుందో కూడా చూసుకోండి. 6 నెలలో, ఒక ఏడాదో వారెంటీ ఇచ్చే పవర్ బ్యాంక్ ఎంచుకోండి. మీరు ఆన్లైన్లో పవర్ బ్యాంకు కొంటే ఓ రెండు రోజులు ఉపయోగించి చూడండి. పవర్ బ్యాంక్ వేడి అవుతున్నా, ఛార్జింగ్‌లో సమస్యలు ఉన్నా వెంటనే రీప్లేస్ చేసుకోవడం మంచిది.
Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
ఇవి కూడా చదవండి:
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?
Personal Finance: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?
RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartphone