BUY SMARTPHONE WORTH 10500 IN JUST RS 3399 AND WIN LOTS OF OFFERS HERE MORE DETAILS SK
Smart Phone: 9వేల స్మార్ట్‌ఫోన్ రూ.3,399కే.. క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.. ఎలా కొనాలంటే..?
ప్రతీకాత్మక చిత్రం
Smart Phones: 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లున్న XGODY A70 అనే మొబైల్ ఫోన్‌ని కేవలం రూ.3,399కే విక్రయిస్తున్నారు. ఇది పరిమిత కాల ఆఫర్.
ఇప్పుడు అందరి చేతుల్లోనే స్మార్ట్ ఫోన్లు (Smart Phones) ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ క్లాస్‌లు రావడంతో స్కూల్ పిల్లలు సైతం ఫోన్లోనే బతుకుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో లభించే మొబైల్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగింది. వాటిని కొనేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. పండగల సమయాల్లో ఈ కామర్స్ సంస్థలు, షోరూమ్స్ ఆఫర్లతో ఊరిస్తాయి. భారీ డిస్కౌంట్లతో సేల్స్ జరుపుతాయి. అలాంటి సేల్‌లో చాలా మంది మొబైల్ కొంటారు. అప్పుడు మిస్సైన వారు నిరుత్సాహ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే www.cart24.co.inలో రూ.10,414 విలువైన మొబైల్ ఫోన్ కేవలం రూ.3,399కే అందుబాటులో ఉంది.
2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లున్న XGODY A70 అనే మొబైల్ ఫోన్‌ని కేవలం రూ.3,399కే విక్రయిస్తున్నారు. ఇది పరిమిత కాల ఆఫర్. cart24లో ఇలా ఎన్నో ఫోన్లపై ఆఫర్లున్నాయి. ఈ సేల్‌లో అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్‌ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఇస్తున్నారు. ఈ సేల్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతి కొనుగోలుపై ₹ 500 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ క్యాష్‌బ్యాక్ మీ ఆర్డర్ కన్ఫామ్ అయిన తర్వాత.. ఈమెయిల్‌కు కూపన్ కోడ్ రూపలో వస్తుంది. ఆ కూపన్‌ని ఇదే వెబ్సైట్లో ఇతర కొనుగోళ్లకు వినియోగించవచ్చు. ఆ కూపన్ కోసం ఆర్డర్ సమయంలో మీ ఈమెయిల్ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది.
CART24 వెబ్సైట్లో స్క్రాచ్ & విన్కి వెళ్లి.. అక్కడ ఈమెయిల్‌ను నమోదు చేసి మీ అదృష్టాన్ని ప్రయత్నించండి . అనంతరం మీకు లభించే స్క్రాచ్ కూపన్‌ను స్క్రాచ్ చేయండి. ఆ స్క్రాచ్ కార్డ్ ద్వారా 10% నుంచి 90% వరకు తగ్గింపుతో పాటు పూర్తి ఉచితంగా ప్రొడక్ట్‌ను పొందే అవకాశముంది. ఆఫర్ ద్వారా కొనుగోలు చేసిన ఉత్పత్తులను తిరిగి తీసుకోరు. అంటే రిటర్న్ చేయలేరు. ప్రొడక్ట్‌లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉనప్పుడు మాత్రమే రిటర్న్ తీసుకుంటారు. దాని స్థానంలో వేరొకటి ఇస్తారు. స్క్రాచ్ & విన్ కింద లభించే అన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్.. రీఫర్బిష్డ్ సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్‌లు. అంటే రిపేర్ చేసిన పాత ఫోన్లన్న మాట. మీరు ఏదైనా ప్రొడక్ట్‌తో సంతృప్తి చెందకపోతే డబ్బు తిరిగి ఇవ్వరు. ఈ డబ్బును కూపన్ల రూపంలో ఇస్తారు. వాటిని ఇతర కొనుగోళ్లకు వినియోగించవచ్చు.
ఇక కోవిడ్ కారణంగా షిప్పింగ్, డెలివరీకి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. సాధారణంగా ఇది 8 నుండి 15 రోజులు వరకు ఉంటుంది. అందుకే కార్ట్ 24 నుంచి ఏదైనా ప్రొడక్ట్‌ని కొనేముందు మీ అవసరాలకు అనుగుణంగా డెలివరీ సమయాన్ని నిర్ధారించుకోండి. ఆ తర్వాత ఆర్డర్ చేయండి.
ఇలాంటి ఆఫర్ల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని కంపెనీలు నిజంగానే భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. మరికొన్ని మాత్రం మోసం చేస్తుంటాయి. గతంలోనూ ఇలాంటివి చాలానే చూశాం. అందుకే ఈకామర్స్ వెబ్సైట్లలో ఏదైనా ఉత్పత్తులను కొనేముందు అన్నింటి గురించి తెలుసుకోవాలి. ఆఫర్లతో పాటు ఉత్పత్తి కూడా వాస్తవమైనదే అని నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్ చేయాలి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.