Home /News /technology /

BUY SAMSUNG SMART TV AND GET SAMSUNG GALAXY A51 AND GALAXY A31 SMARTPHONE FOR FREE SS

Samsung Big TV Days: సాంసంగ్ టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా

Samsung Big TV Days: సాంసంగ్ టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా
(image: Samsung India)

Samsung Big TV Days: సాంసంగ్ టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా (image: Samsung India)

Samsung Big TV Days Sale | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. సాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్ ప్రకటించింది. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

    మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రెండూ వేర్వేరుగా కొనాల్సిన అవసరం లేదు. స్మార్ట్ టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందొచ్చు. సాంసంగ్ అందిస్తున్న ఆఫర్ ఇది. సాంసంగ్ ఇండియా బిగ్ టీవీ డేస్ ఆఫర్స్ ప్రకటించింది. 55 అంగుళాల టీవీ నుంచి ప్రీమియం టీవీల వరకు అన్ని స్మార్ట్ టీవీలపైన ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ 2021 జనవరి 31 వరకు పొందొచ్చు. దేశంలోని అన్ని సాంసంగ్ స్టోర్స్‌లో బిగ్ టీవీ డేస్ ఆఫర్స్ లభిస్తాయి. సాంసంగ్ బ్రాండ్‌కు చెందిన 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 82 అంగుళాలు, 85 అంగుళాల క్యూలెడ్ టీవీలు, క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ, క్యూలెడ్ 8కే టీవీలపై ఆఫర్స్ ఉన్నాయి. కస్టమర్లు 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఎక్స్‌టెండెడ్ వారెంటీ ఆఫర్స్ పొందొచ్చు. రూ.1,990 ఈఎంఐకే టీవీ కొనొచ్చు.

    Mi 10i vs OnePlus Nord vs Moto g 5g: ఈ మూడు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

    POCO Smartphones: ఈ 4 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన పోకో ఇండియా... లేటెస్ట్ రేట్స్ ఇవే


    సాంసంగ్ 65 అంగుళాల క్యూలెడ్ టీవీ, 75 అంగుళాల క్రిస్టల్ 4కే అల్ట్రాహెచ్‌డీ టీవీ కొంటే రూ.22,999 విలువైన సాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇక 55 అంగుళాల క్యూలెడ్ టీవీలు, 65 అంగుళాల క్రిస్టల్ 4కే అల్ట్రాహెచ్‌డీ టీవీలు కొంటే రూ.18,999 విలువైన సాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇక 75 అంగుళాలు, 82 అంగుళాలు, 85 అంగుళాల క్యూలెడ్ టీవీలు కొన్నవారికి రూ.48,990 విలువైన సౌండ్‌బార్ HW-Q800T లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్ HW-Q900T లభిస్తుంది.

    Realme Days Sale: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్

    Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

    సాంసంగ్ క్యూలెడ్ టీవీలు కొంటే 10 ఏళ్ల నో స్క్రీన్ బర్న్ ఇన్ వారెంటీ, ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, ప్యానెల్‌పై ఒక ఏడాది అడిషనల్ వారెంటీ లభిస్తుంది. క్యూలెడ్ టీవీల్లో యాంబియెంట్ మోడ్ ఉంటుంది. యాంబియెంట్ మోడ్ ఆన్ చేస్తే స్మార్ట్ టీవీ ఓ కళాఖండంగా మారిపోతుంది. ఇంట్లోని ఇంటీరియర్‌కు తగ్గట్టుగా స్మార్ట్ టీవీని పీస్ ఆఫ్ ఆర్ట్‌గా మార్చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Samsung, Smart TV

    తదుపరి వార్తలు