Redmi Note 7 Pro: ఒక్క రూపాయికే రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 7 ప్రో... కాసేపట్లో సేల్

Xiaomi Mi Fan Festival 2019 | రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు Mi Soundbar కూడా ఒక్క రూపాయికే కొనే అవకాశం కల్పిస్తోంది షావోమీ. 20 ఎంఐ సౌండ్‌బార్ యూనిట్లు సేల్‌లో ఉంటాయి.

news18-telugu
Updated: April 4, 2019, 11:35 AM IST
Redmi Note 7 Pro: ఒక్క రూపాయికే రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 7 ప్రో... కాసేపట్లో సేల్
Redmi Note 7 Pro: ఒక్క రూపాయికే రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇలా కొనాలి
news18-telugu
Updated: April 4, 2019, 11:35 AM IST
ఒక్క రూపాయికి ఏమొస్తుంది అంటే ఏమీ రాదన్న సమాధానమే ఎక్కువ వినిపిస్తుంది. కానీ రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే కొనొచ్చు. షావోమీ అందిస్తున్న సూపర్ ఆఫర్ ఇది. షావోమీ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019లో ఈ ఆఫర్ పొందొచ్చు. ఏప్రిల్ 4న ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తొలిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదటి ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది షావోమీ. ఈ సేల్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క రూపాయికే కొనొచ్చు. మొత్తం 20 స్మార్ట్‌ఫోన్లను రూపాయికే అమ్మనుంది షావోమీ. రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు Mi Soundbar కూడా ఒక్క రూపాయికే కొనే అవకాశం కల్పిస్తోంది షావోమీ. 20 ఎంఐ సౌండ్‌బార్ యూనిట్లు సేల్‌లో ఉంటాయి.

Read this: TikTok Ban: టిక్‌టాక్ యూజర్లకు షాక్... యాప్‌ను బ్యాన్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు

ఏప్రిల్ 6 వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 జరనుంది. మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, డీల్స్, సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది షావోమీ. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ సేల్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది షావోమీ. వన్ రుపీ ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాలనుకునేవాళ్లు మధ్యాహ్నం రెండు గంటల కంటే ముందే mi.com వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ చేయాలి. ఫ్లాష్ సేల్‌ కాబట్టి ఒక్క సెకనులోనే సేల్ ముగిసిపోతుంది. ఫ్లాష్ సేల్‌లో ఆర్డర్ బుక్ చేయాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్‌ తప్పనిసరి.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే



ఇవి కూడా చదవండి:

Paytm: పేటీఎం నుంచి త్వరలో మరో సర్వీస్... షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు
Loading...
WhatsApp: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626