Poco F1: రూ.19,999 విలువైన పోకో ఎఫ్1 ఒక్క రూపాయికే... కాసేపట్లో సేల్

Xiaomi Mi Fan Festival 2019 Flash sale | పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌తో పాటు హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్‌ను కూడా రూపాయికే అమ్మనుంది షావోమీ. 20 హోమ్ కెమెరా యూనిట్లు సేల్‌లో ఉంటాయి.

news18-telugu
Updated: April 5, 2019, 9:29 AM IST
Poco F1: రూ.19,999 విలువైన పోకో ఎఫ్1 ఒక్క రూపాయికే... కాసేపట్లో సేల్
Poco F1: రూ.19,999 విలువైన పోకో ఎఫ్1 ఒక్క రూపాయికే... కాసేపట్లో సేల్
news18-telugu
Updated: April 5, 2019, 9:29 AM IST
ఏప్రిల్ 4న షావోమీ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 ప్రారంభమైంది. మొదటి రోజున ఫ్లాష్ సేల్‌లో ఒక్క రూపాయికే రెడ్‌మీ నోట్ 7 ప్రో, ఎంఐ సౌండ్‌బార్ అమ్మింది షావోమీ. ఏప్రిల్ 5న మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షావోమీ. ఈ సేల్‌లో పోకో ఎఫ్1(6జీబీ+64జీబీ) స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క రూపాయికే కొనొచ్చు. మొత్తం 20 స్మార్ట్‌ఫోన్లను రూపాయికే అమ్మనుంది షావోమీ. పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌తో పాటు హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్‌ను కూడా రూపాయికే అమ్మనుంది షావోమీ. 20 హోమ్ కెమెరా యూనిట్లు సేల్‌లో ఉంటాయి.

ఏప్రిల్ 6 వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 జరనుంది. మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, డీల్స్, సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది షావోమీ. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ సేల్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది షావోమీ. వన్ రుపీ ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాలనుకునేవాళ్లు మధ్యాహ్నం రెండు గంటల కంటే ముందే mi.com వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ చేయాలి. ఫ్లాష్ సేల్‌ కాబట్టి ఒక్క సెకనులోనే సేల్ ముగిసిపోతుంది. ఫ్లాష్ సేల్‌లో ఆర్డర్ బుక్ చేయాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్‌ తప్పనిసరి.

Read this: TikTok Ban: టిక్‌టాక్ యూజర్లకు షాక్... యాప్‌ను బ్యాన్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...




Redmi Note 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.10,999.
Redmi 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,499 కాగా ఆఫర్ ధర రూ.7,999.
Redmi 6 (3GB+32GB): ప్రస్తుత ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.6,999.
Loading...
ఇవే కాకుండా రెడ్‌మీ 6ఏ, ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ టీవీ 4 ప్రో, ఎంఐ బాడీ కాంపోజిషన్ స్కేల్, ఎంఐ బ్యాండ్‌పై ఆఫర్లున్నాయి. రూ.99 ధరకే ఎంఐ మిస్టరీ బాక్స్ కూడా అమ్మకానికి పెడుతోంది షావోమీ. అందులో షావోమీ మర్కండైజ్, యాక్సెసరీస్ ఉంటాయి. mi.com వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు పొందొచ్చు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

IRCTC E-Ticket: స్లీపర్ క్లాస్ టికెట్‌తో థర్డ్ ఏసీలో ఉచితంగా ప్రయాణం... ఆటో అప్‌గ్రేడేషన్‌తో ఎన్నో లాభాలు

PF Withdrawl: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

Paytm: పేటీఎం నుంచి త్వరలో మరో సర్వీస్... షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...