Home /News /technology /

BUY MI SMART BAND 6 WITH HUGE DISCOUNT ON AMAZON GREAT INDIAN FESTIVAL SALE KNOW OFFER DETAILS SS GH

Mi Smart Band 6: ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6పై అదిరిపోయే ఆఫర్​​... అమెజాన్ సేల్​లో భారీగా తగ్గిన ధర

Mi Smart Band 6: ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6పై అదిరిపోయే ఆఫర్​​... అమెజాన్ సేల్​లో భారీగా తగ్గిన ధర
(image: Xiaomi India)

Mi Smart Band 6: ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6పై అదిరిపోయే ఆఫర్​​... అమెజాన్ సేల్​లో భారీగా తగ్గిన ధర (image: Xiaomi India)

Mi Smart Band 6 | మీరు ఫిట్‌నెస్ బ్యాండ్ కొనాలనుకుంటున్నారా? షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ఫిట్‌నెస్ బ్యాండ్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

ఇంకా చదవండి ...
భారత్‌లో స్మార్ట్​ వాచ్​, ఫిట్​నెస్​​ బ్యాండ్​ మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. కరోనా తర్వాత ఆరోగ్య సంరక్షణపై సృహ పెరగడంతో ఫిట్​నెస్​​ బ్యాండ్ల (Fitness Band) కొనుగోళ్లు మరింతగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనీస్​ స్మార్ట్​ దిగ్గజం షావోమీ ఇటీవల ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 (Mi Smart Band 6) పేరుతో స్మార్ట్​బ్యాండ్​ను​ లాంచ్​ చేసింది. ప్రస్తుతం అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో దీనిపై భారీ డిస్కౌంట్​ అందజేస్తుంది. దీని కొనుగోలుపై రూ. 1000 డిస్కౌంట్​​ పొందవచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 అసలు ధర రూ. 3,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 2,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఆర్​డీఎల్​ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కొనుగోలుపై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

WhatsApp: అలర్ట్... ఈ తప్పు చేస్తే వాట్సప్ బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ఫీచర్లు


ఎంఐ స్మార్ట్​ బ్యాండ్ 6 లో 1.56 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఎంఐ బ్యాండ్​ 5 కంటే ఇది చాలా పెద్ద డిస్​ప్లేగా చెప్పవచ్చు. ఇది 1.1 అంగుళాల టచ్​ స్క్రీన్​ డిస్​ప్లేతో వస్తుంది. దీన్ని పిల్ షేప్​ ప్యానెల్​తో డిజైన్​ చేశారు. ఇది స్విమ్మింగ్, స్ట్రోక్ కౌంట్, డిస్టెన్స్.. ఇలా 30కి పైగా స్పోర్ట్స్​ యాక్టివిటీస్​ను ట్రాక్​ చేయగలదు. దీనిలో లాంగ్​ లాస్టింగ్​ బ్యాటరీని అందించింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 2 వారాలకు పైగా బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ సులభంగా అటాచ్ అయ్యే మాగ్నెటిక్ ఛార్జర్‌తో వస్తుంది. ఇది మీ హృదయ స్పందన రేటు, 24/7 ట్రాక్ చేసే హార్ట్ రేట్​ను మానిటరింగ్​​ చేయగలదు. ఈ స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్​తో మ్యూజిక్​ను కూడా కంట్రోల్​ చేయవచ్చు.

Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

ఇందులో మల్టిపుల్​ డయల్ ఫేసెస్​ అందించారు. మీ అభిరుచికి అనుగుణంగా డయల్​ ఫేస్​ను సెట్ చేసుకోవచ్చు. దీనిలో వాటర్​ రెసిస్టెన్స్ ను కూడా అందించారు. స్విమ్మింగ్​ చేసేటప్పుడు కూడా దీన్ని ధరించవచ్చు. ఇది అన్ని iOS, ఆండ్రాయిడ్​ పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. Mi స్మార్ట్ బ్యాండ్ 6 స్ట్రెస్​ మానిటరింగ్​, SpO2 ట్రాకింగ్, మహిళల హెల్త్​ ట్రాకింగ్, పర్సనల్​ యాక్టివిటీ ఇంటెలిజెన్స్​ వంటి అడ్వాన్సుడ్​ ఫీచర్లతో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Smartwatch, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు