Mi LED TV: ఒక్క రూపాయికే ఎంఐ ఎల్ఈడీ టీవీ... కాసేపట్లో ఫ్లాష్ సేల్

Xiaomi Mi Fan Festival 2019 | ఈ సేల్‌లో రూ.12,999 విలువైన Mi LED TV 4A PRO 32 టీవీని ఒక్క రూపాయికే అమ్మనుంది. 10 టీవీలను సేల్‌లో ఉంచింది షావోమీ.

news18-telugu
Updated: April 6, 2019, 9:50 AM IST
Mi LED TV: ఒక్క రూపాయికే ఎంఐ ఎల్ఈడీ టీవీ... కాసేపట్లో ఫ్లాష్ సేల్
Mi LED TV: ఒక్క రూపాయికే ఎంఐ ఎల్ఈడీ టీవీ... కాసేపట్లో ఫ్లాష్ సేల్
news18-telugu
Updated: April 6, 2019, 9:50 AM IST
షావోమీ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఆఫర్లు అట్రాక్ట్ చేస్తున్నాయి. మొదటి రెండు రోజుల్లో నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రో, పోకో ఎఫ్1, హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్‌, ఎంఐ సౌండ్‌బార్‌లను ఒక్క రూపాయికే అమ్మి సంచలనం సృష్టించింది షావోమీ. సేల్‌లో తక్కువ యూనిట్లే ఉన్నా... ఒక్కరూపాయికే సొంతం చేసుకునేందుకు షావోమీ ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం రెండు గంటలకు చివరి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షావోమీ. ఈ సేల్‌లో రూ.12,999 విలువైన Mi LED TV 4A PRO 32 టీవీని ఒక్క రూపాయికే అమ్మనుంది. 10 టీవీలను సేల్‌లో ఉంచింది షావోమీ. దాంతో పాటు రూ.1,499 విలువైన Mi Sports Bluetooth ఇయర్‌ఫోన్‌ కూడా ఒక్క రూపాయికే అమ్మనుంది షావోమీ. ఇవి 30 యూనిట్లు ఉంటాయి. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, డీల్స్, సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది షావోమీ.

Read this: IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

MFF 2019, Mi Fan Festival, mi fan festival 2019, MFF 2019, Mi LED TV 4A PRO 32 for just Rs.1, one rupee sale, Xiaomi Mi Fan Festival 2019, Xiaomi Mi Fan Festival offers, Xiaomi Mi Fan Festival deals, Mi Sports Bluetooth earphones, Xiaomi Mi Fan Festival flash sale, Mi LED TV 4A PRO 32, ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్, ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్, షావోమీ ఆఫర్స్, ఎంఐ ఎల్ఈడీ టీవీ, ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్



ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...


Redmi Note 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.10,999.


Redmi 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,499 కాగా ఆఫర్ ధర రూ.7,999.
Redmi 6 (3GB+32GB): ప్రస్తుత ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.6,999.
Loading...
ఇవే కాకుండా రెడ్‌మీ 6ఏ, ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ టీవీ 4 ప్రో, ఎంఐ బాడీ కాంపోజిషన్ స్కేల్, ఎంఐ బ్యాండ్‌పై ఆఫర్లున్నాయి. రూ.99 ధరకే ఎంఐ మిస్టరీ బాక్స్ కూడా అమ్మకానికి పెడుతోంది షావోమీ. అందులో షావోమీ మర్కండైజ్, యాక్సెసరీస్ ఉంటాయి. mi.com వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు పొందొచ్చు. షావోమీ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌ 2019 ఏప్రిల్ 6న ముగుస్తుంది.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ONGC Jobs: ఓఎన్జీసీలో 900 ఖాళీలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి

PF Withdrawl: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...