Home /News /technology /

BUY ANY SMARTPHONE BY PAYING JUST 70 PER CENT WITH FLIPKART SMART UPGRADE PLAN KNOW HOW SS

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Big Billion Days Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ (Flipkart Smart Upgrade Plan) కూడా ఉంది. ఈ ఆఫర్ ద్వారా కేవలం 70 శాతం డబ్బులు చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
    ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 7 నుంచి 12 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పటికే మోటో జీ60 (Moto G60), పోకో ఎక్స్3 ప్రో (Poco X3 Pro), ఏసుస్ రోగ్ ఫోన్ 3 (Asus Rog Phone 3), మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 (Micromax In Note 1), మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (Motorola Edge 20 Fusion) స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ (Flipkart Smart Upgrade Plan) కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ఫోన్ ధరలో కేవలం 70 శాతం మాత్రమే చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

    WhatsApp: వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే... మీరు వాడుతున్నారా?

    ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ వివరాలను వెబ్‌సైట్‌లో వివరించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ప్లాన్ ద్వారా కేవలం 70 శాతం మాత్రమే చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ 70 శాతం కూడా ముందే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ద్వారా కొనొచ్చు. 12 నెలలు, 18 నెలలు, 24 నెలల్లో ఈఎంఐ చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ కూడా అవసరం లేదు. అయితే ఇది స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ కాబట్టి ఏడాది తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్మార్ట్‌ఫోన్ మార్చకూడదనుకుంటే మిగతా 30 శాతం చెల్లించాలి.

    iPhone 13 Offers: ఐఫోన్ 13 మోడల్స్‌పై రూ.46,000 వరకు తగ్గింపు... ఆఫర్ ఎలా పొందాలంటే

    ఉదాహరణకు మీరు రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే నేరుగా అయితే రూ.20,000 చెల్లించాలి. కానీ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లో రూ.14,000 చెల్లిస్తే చాలు. రూ.6,000 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ లభిస్తుంది. ప్రోగ్రామ్ ఫీజు కింద రూ.99 చెల్లించాలి. అంటే మీరు చెల్లించేది రూ.14,099 మాత్రమే. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,350 చెల్లించాలి. ఏడాది తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయొచ్చు. లేదా మిగతా రూ.6,000 చెల్లించాలి.

    ఇక మీరు రూ.30,000 విలువైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీరు రూ.21,000 చెల్లిస్తే చాలు. మీకు రూ.9,000 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ లభిస్తుంది. ఏడాది తర్వాత మిగతా రూ.9,000 చెల్లించాలి. లేదా ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలి. ఇలా మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 70 శాతం చెల్లించి సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. మీరు ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా పేమెంట్ ఆప్షన్‌లో స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ కనిపిస్తుంది. అయితే ఈ ఆఫర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనేముందు నియమనిబంధనలన్నీ తెలుసుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Flipkart Big Billion Days, Mobile News, Mobiles, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు