Amazon Sale | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌లో (Amazon) సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. 5జీ ఫోన్‌పై (Phone) సూపర్ డీల్ లభిస్తోంది. ఐకూ జెడ్ 6 ప్రో 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్ సొంతం చేసకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 23,999గా, 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది. అయితే మీరు 12 జీబీ ర్యామ్ ఫోన్‌ను కేవలం రూ. 7 వేలకే కూడా సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో ఐకూ జెడ్ 6 ప్రో 5జీ ఫోన్ ప్రస్తుతం రూ. 27,999కు అందుబాటులో ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఈ ఫోన్‌పై రూ. 3 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా మరోఆఫర్ కూడా ఉంది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.18 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు ఈ 12 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 7 వేలకే కొనొచ్చని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ ప్రాతిపదికన మారుతుందని గుర్తించుకోవాలి. మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఫిబ్రవరి 3 నుంచి ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. 80 శాతం తగ్గింపు పొందండి!
ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.44 ఇంచుల అమొలెడ్ డిస్‌ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ ఉంటుంది.ఇది 5జీ సపోన్ట్ చేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్.. రూ.12,990కే 39 ఇంచుల టీవీ, కిర్రాక్ ఆఫర్!
అలాగే ఈ ఫోన్‌లో ఫోటో గ్రఫీ విషయానికి వస్తే.. 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మ క్రో కెమెరా ఉన్నాయి. ఇక ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే 18 నిమిసాల్లోనే సగం బ్యాటరీ ఫుల్ అవుతుంది. కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g phones, 5G Smartphone, Flipkart, IQoo, Latest offers, Mobile offers