హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jeff Bezos: ఔటర్ స్పేస్‌లో బిజినెస్ పార్క్ ఏర్పాటు.. అంతరిక్ష రంగంలో జెఫ్ బెజోస్ భవిష్యత్తు ప్రణాళిక

Jeff Bezos: ఔటర్ స్పేస్‌లో బిజినెస్ పార్క్ ఏర్పాటు.. అంతరిక్ష రంగంలో జెఫ్ బెజోస్ భవిష్యత్తు ప్రణాళిక

ఔటర్ స్పేస్‌లో బిజినెస్ పార్క్.. బిజోస్ కొత్త ప్రణాళిక

ఔటర్ స్పేస్‌లో బిజినెస్ పార్క్.. బిజోస్ కొత్త ప్రణాళిక

ఈ ఆర్బిటల్ రీఫ్ అనేది స్పేస్ స్టేషన్. మిక్సెడ్ యూజ్ బిజినెస్ పార్క్ వలే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంతరిక్షంలో నూతన మార్కెట్లను నెలకొల్పడానికి, ఆర్థిక కార్యకలపాలు నిర్వహించడానికి అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తుంది.

అంతరిక్ష రంగంపై ఇటీవల కాలంలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. ఎలాన్ మస్క్ లాంటి కుబేరులు స్పేస్ పరిశోధనపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ జాబితాలో అగ్ర కుబేరుడు జెఫ్ బేజోస్ కూడా చేరిపోయారు. తన అమెరికన్ స్పేస్ ప్లైట్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్‌ ద్వారా బిజనెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్బిటల్ రీఫ్ అనే కమర్షియల్ స్పేస్ స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నట్లు బ్లూ ఆరిజిన్‌ సోమవారం ప్రకటించింది. ఈ ప్రణాళికలో సియర్రా స్పేస్ కార్పొరేషన్, విమాన తయారీ సంస్థ బోయింగ్ కూడా భాగమయ్యాయి. ఈ స్పేష్ స్టేషన్ ను అంతరిక్షంలో బిజినెస్ పార్క్ మాదిరిగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ దశాబ్దం ద్వితీయార్థంలో (2025 తర్వాత) ఈ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.

* ఆర్బిటల్ రీఫ్ అంటే ఏంటి?

బ్లూ ఆరిజిన్‌ ప్రకారం ఈ ఆర్బిటల్ రీఫ్ అనేది స్పేస్ స్టేషన్. మిక్సెడ్ యూజ్ బిజినెస్ పార్క్ వలే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంతరిక్షంలో నూతన మార్కెట్లను నెలకొల్పడానికి, ఆర్థిక కార్యకలపాలు నిర్వహించడానికి అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తుంది. సియర్రా స్పేస్, బోయింగ్ ఇందులో భాగస్వాములు. ఇవి కాకుండా రెడ్వైర్ స్పేస్, జెనిసిస్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లాంటి సంస్థలు వెనకుండి మద్దతు ఇస్తున్నాయి.

"సీజన్డ్ స్పేస్ ఏజెన్సీలు, హైటెక్ కన్సార్టియా, స్పేస్ ప్రోగ్రామ్స్ లేని దేశాలు, మీడియా, ట్రావెల్ కంపెనీలు, నిధులు సమకూర్చే వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పెట్టుబడిదారులందరికీ ఆర్బిటల్ రీఫ్‌లో స్థానం ఉంది" అని కంపెనీలు ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.

* ఔటర్ స్పేస్ ద్వారా తదుపరి అధ్యాయం..

ప్రైవేట్ స్పేస్ అనగానే చాలా మంది నిపుణులు స్పేస్ టూరిజానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సహా పలు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు ఈ సంవత్సరంలో టూరిజం వెంచర్లను ప్రారంభించడంతో ఎక్కువ మంది పర్యాటకులతో వ్యాపారం మాత్రమే కొనసాగుతుందని అనుకుంటున్నారు. అయితే భవిష్యత్తు కోసం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ, వ్యాపార నమూనా అభివృద్ధిని సులభతరం చేయడానికి ఈ స్పేస్ స్టేషన్ మానవుని అంతరిక్ష అన్వేషణలో తదుపరి అధ్యాయంగా నిలుస్తుందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో సియర్రా స్పేస్ మొదటి ఫ్రీ ఫ్లయింగ్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం జులై బ్లూ ఆరిజిన్‌ విజయవంతంగా పర్యాటక అంతరిక్ష యాత్రను నిర్వహించింది. ఇందులో జెఫ్ బెజోస్ తో పాటు మరో ముగ్గురు కూడా పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో యూఎస్ నటుడు 90 ఏళ్ల విలియం షాట్నర్ ను స్పేస్ లోకి తీసుకెళ్లింది. తద్వారా అంతరిక్షయానం చేసి అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు.

First published:

Tags: Jeff Bezos, Space

ఉత్తమ కథలు