హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో బంపర్ ఆఫర్లు.. ఈ 10 డీల్‌లు మీరు చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో బంపర్ ఆఫర్లు.. ఈ 10 డీల్‌లు మీరు చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

 అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో బంపర్ ఆఫర్లు.. ఈ  10 డీల్‌లు మీరు చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో బంపర్ ఆఫర్లు.. ఈ 10 డీల్‌లు మీరు చూస్తే వెంటనే బుక్ చేస్తారు !

అమెజాన్ (Amazon) ప్రైమ్ డే సేల్ 2022 పేరుతో జులై 23 నుంచి వివిధ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్ల(Offers)ను అందించనుంది. జులై 24 వరకు కొనసాగే రెండు రోజుల ఈ స్పెషల్ సేల్‌ కోసం టాప్ ప్రొడక్ట్స్‌పై ‘ఎర్లీ డీల్స్’ అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్‌లో గాడ్జెట్‌లు కూడా ఉన్నాయి. వీటితో పాటు యూజర్లు మిస్ చ

ఇంకా చదవండి ...

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) మరో ఆఫర్ సేల్‌ను ప్రారంభిస్తోంది. ప్రైమ్ డే సేల్ 2022 పేరుతో జులై 23 నుంచి వివిధ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనుంది. జులై 24 వరకు కొనసాగే రెండు రోజుల ఈ స్పెషల్ సేల్‌ కోసం టాప్ ప్రొడక్ట్స్‌పై ‘ఎర్లీ డీల్స్’ అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్‌లో గాడ్జెట్‌లు కూడా ఉన్నాయి. వీటితో పాటు యూజర్లు మిస్ చేయకూడని టాప్ 10 డీల్స్ ఏవో చూద్దాం.

HP 15 laptop

హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ రూ. 5,467 డిస్కౌంట్‌తో రూ. 38,999 వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ AMD Ryzen 3 3250 ప్రాసెసర్‌తో, 8GB RAM, 1TB + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 15.6-అంగుళాల FHD డిస్ప్లేను కలిగి ఉంది.

OnePlus Buds Pro

ఈ ఇయర్ బడ్స్ రూ. 3,000 డిస్కౌంట్‌తో రూ. 8,990 వద్ద లభిస్తున్నాయి. వన్‌ప్లస్ బడ్స్ ప్రో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. నాయిస్‌ను 48dB వరకు కంట్రోల్ చేస్తుంది. ఛార్జింగ్ కేసుతో 38 గంటల ప్లేయింట్ టైమ్‌ను అందిస్తుంది.

Samsung Galaxy Buds Pro

ఈ ఇయర్ బడ్స్‌పై అమెజాన్ ఏకంగా రూ. 11,200 డిస్కౌంట్(Discount) ప్రకటించింది. తాజా ఆఫర్‌లో గెలాక్సీ బడ్స్ ప్రో రూ. 6,790కు లభిస్తుంది. ఎర్లీ ప్రైమ్ డే డీల్స్‌లో భాగంగా అమెజాన్ వీటిని ఫ్లాట్ 62% డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. TWS ఇయర్‌బడ్స్ 99% నాయిస్ క్యాన్సిలేషన్, 18 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి.

Jabra Elite 3

ఈ ఇయర్‌బడ్స్‌పై రూ. 3,500 డిస్కౌంట్ ఉంది. ఆఫర్లో రూ. 3,499 వద్ద లభిస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ 4 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌తో నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీతో వస్తాయి. డీ బాస్‌తో క్లియర్, లౌడ్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందజేస్తాయి.

Mivi Play బ్లూటూత్ స్పీకర్

ఈ స్పీకర్ రూ. 1,200 డిస్కౌంట్ తర్వాత రూ. 799కి లభిస్తుంది. Mivi Play పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. కాల్స్ తీసుకోవడానికి ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్‌ ఇందులో ఉంటుంది.

Xiaomi Home Security Camera 2i

ఈ సీసీ కెమెరా రూ. 1,650 డిస్కౌంట్‌తో రూ. 2,799కి లభిస్తుంది. షియోమి హోమ్ సెక్యూరిటీ కెమెరా 2i FHD రిజల్యూషన్‌తో AI- పవర్డ్ మోషన్ డిటెక్షన్, IR-బేస్డ్ నైట్ విజన్, 360-డిగ్రీ వ్యూ ఆప్షన్లతో వస్తుంది.

ఇదీ చదవండి:  Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


Mi 10000 mAh power bank

ఇది రూ. 300 డిస్కౌంట్‌తో రూ. 999 వద్ద లభిస్తుంది. ప్రైమ్ ఎర్లీ డే డీల్స్‌లో భాగంగా దీనిపై 23% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ డ్యుయల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్‌లతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Lenovo IdeaPad Slim 3

ఈ డివైజ్‌పై అమెజాన్ రూ. 19,900 డిస్కౌంట్ ప్రకటించి, రూ. 46,490కి అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌తో 8GB RAM, 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ ఆఫీస్ 2021తో పాటు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2: రూ. 2,000 తగ్గింపు తర్వాత రూ. 2,999కి లభిస్తుంది

Realme నుండి బడ్స్ ఎయిర్ 2 ANC మద్దతుతో వస్తుంది మరియు ఛార్జింగ్ కేస్‌తో సహా 25 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుందని క్లెయిమ్ చేయబడింది. మొగ్గలు 10mm డ్రైవర్లతో వస్తాయి.

Redmi 43 inches 4K Ultra HD Android Smart LED TV

స్మార్ట్‌టీవీ(Smart tv) ప్రస్తుత సేల్‌లో రూ. 17,000 డిస్కౌంట్‌తో రూ. 25,999కి లభిస్తుంది. 43-అంగుళాల TV అప్‌స్కేలింగ్, డాల్బీ విజన్ సపోర్ట్, 4K UHD ప్యానెల్‌, మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. టీవీ డాల్బీ ఆడియో, DTS సపోర్ట్‌తో పనిచేసే 30W స్పీకర్లు దీని సొంతం.

Published by:Mahesh
First published:

Tags: Amazon prime, Lenovo, Mobile offers, Xiaomi

ఉత్తమ కథలు