హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones: బంపర్ ఆఫర్ ఆ ఫోన్లపై ఏకంగా రూ 15 వేలు తగ్గింపు.. చూస్తే వెంటనే కొనేస్తారు!

Smartphones: బంపర్ ఆఫర్ ఆ ఫోన్లపై ఏకంగా రూ 15 వేలు తగ్గింపు.. చూస్తే వెంటనే కొనేస్తారు!

బంపర్ ఆఫర్ ఆ ఫోన్లపై ఏకంగా రూ 15 వేలు తగ్గింపు.. చూస్తే వెంటనే కొనేస్తారు!

బంపర్ ఆఫర్ ఆ ఫోన్లపై ఏకంగా రూ 15 వేలు తగ్గింపు.. చూస్తే వెంటనే కొనేస్తారు!

కొత్తగా లాంచ్ అయిన ఈ ఫోన్ల ధర (Phone Prices) ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా రూ.15 వేల వరకు తగ్గాయి. విడుదలై కొన్ని నెలలే అవుతోంది కాబట్టి వినియోగదారులు వీటిని తగ్గింపు ధరల (Discount Prices) తో కొనుగోలు చేసుకుని చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

ఇటీవల కాలంలో చాలా కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్స్ (Smartphones) రిలీజ్ అయ్యాయి. వీటిలో చాలావరకు బెస్ట్ ఫీచర్లతో అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే కొత్తగా లాంచ్ అయిన ఈ ఫోన్ల ధర (Phone Prices) ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా రూ.15 వేల వరకు తగ్గాయి. విడుదలై కొన్ని నెలలే అవుతోంది కాబట్టి వినియోగదారులు వీటిని తగ్గింపు ధరల (Discount Prices) తో కొనుగోలు చేసుకుని చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ధరలు తగ్గిన వాటిలో అన్ని బ్రాండ్ ఫోన్స్‌యే ఉన్నాయి. వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

- iQoo 7

ఐకూ 7 మొబైల్‌ను మీరు రూ. 1,000 అదనపు డిస్కౌంట్(Discount) కూపన్‌తో సహా రూ.28,990కే సొంతం చేసుకోవచ్చు. iQoo 7.. 8GB+128GB ధర రూ.31,990 ఉండగా.. 12GB+256GB ధర రూ.35,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు వేరియంట్‌లు రూ.2,000 డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.

- శాంసంగ్ గెలాక్సీ M32 5G

శాంసంగ్ ప్రియులు గెలాక్సీ M32 5Gని రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M32 5Gని 6GB RAM వేరియంట్ రూ.18,999 ధరతో విడుదలైంది. రూ. 2,000 డిస్కౌంట్ తో ఇప్పుడు అది రూ.16,999కే అందుబాటులోకి వచ్చింది.

- శాంసంగ్ గెలాక్సీ M52 5G

శాంసంగ్ గెలాక్సీ M52 5G 6GB RAM వేరియంట్ రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లే, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778 5G, 5000mAh బ్యాటరీతో

- వన్‌ప్లస్ 9 5G

వన్‌ప్లస్ 9 5G ని రూ.37,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB RAM వేరియంట్ రూ.49,999, 12GB RAM వేరియంట్ రూ.54,999 లాంచ్ అయ్యాయి. వీటిపై రూ.5,000, రూ.7,000 చొప్పున డిస్కౌంట్స్ ఉన్నాయి.

- వన్‌ప్లస్ 9 ప్రో

వన్‌ప్లస్ 9 ప్రో రూ.64,999 ధరతో లాంచ్ అయింది. దీనిపై ఇప్పటివరకు రూ.15,000 తగ్గింపు ప్రకటించారు. దాంతో ప్రస్తుతం బేస్ వేరియంట్‌ ధర రూ.49,999కి తగ్గిపోయింది. 12GB వేరియంట్‌ రూ.54,999కి దొరుకుతుంది.

- Vivo V21 5G పై

వివో V21 5G ఫోన్ ధర లాంచ్ అయిన సమయం నుంచి రూ.4,000 వరకు తగ్గింది. రూ.27,999 ధరతో ఈ విడుదలయిన ఈ ఫోన్ ఇప్పుడు నాలుగువేల డిస్కౌంట్‌తో రూ.23,999కి దిగి వచ్చింది.

- వివో V21e 5G

Vivo V21e 5Gని 8GB + 128GB, 8GB + 256GB రెండు వేరియంట్‌లలో వరుసగా రూ.32,990, రూ.35,990 ధరలతో లాంచ్ అయ్యాయి. ఈ రెండు వేరియంట్‌లపై రూ.5,000 డిస్కౌంట్ తీసుకురాగా ఇప్పుడు వరుసగా 126GB వెర్షన్ ధర రూ. 27,990, 256GB వెర్షన్ ధర రూ.30,900కి తగ్గింది.

ఇదీ చదవండి : 147 years of BSE: మర్రి చెట్టుకింద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్ర చదివితే మీరే ఆశ్చర్యపోతారు..!

- Mi 11X Pro

Mi 11X Pro స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 888 ప్రాసెసర్‌తో రూ.39,999 స్టార్టింగ్ ప్రైస్‌తో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,000 తగ్గింది. ఇప్పుడు 8GB + 128GB వేరియంట్ ధర రూ. 34,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 36,999గా ఉంది.

- రెడ్‌మీ నోట్ 10ఎస్

రెడ్‌మీ నోట్ 10S 6GB+64GB రూ.14,999, 6GB+128GB రూ.15,999 ధరలతో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లపై రూ. 2,000 ధర తగ్గింపును పొందింది. దాంతో ప్రస్తుతం వీటిని రూ.12,999, రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు.

- రెడ్‌మీ నోట్ 10T

రెడ్‌మీ నోట్ 10T 4GB వేరియంట్‌ రూ.13,999 ధరతో, 6GB వెర్షన్‌ రూ. 15,999 దానితో అందుబాటులోకి వచ్చింది. కాగా ఇప్పుడు రూ.2,000 ధర తగ్గింపుతో మీరు రూ.11,999, రూ.13,999కి కొనుగోలు చేయవచ్చు.

- జియోఫోన్ నెక్స్ట్

JioPhone నెక్స్ట్‌ గతేడాది రూ.6,499కి విడుదలైంది. ఇప్పుడిది రూ. 1,900 తగ్గి రూ.4,599కే లభిస్తోంది.

- ఒప్పో A16K

ఒప్పో A16K 3GB RAM, 4GB RAM అనే రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 3GB ధర రూ.10,490 కాగా 4GB RAM ధర రూ. 10,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇటీవలే 3GB వేరియంట్‌ ధర రూ.1,000, 4GB RAM వేరియంట్‌ ధర రూ.500 తగ్గింది.

Published by:Mahesh
First published:

Tags: Mobile offers, Oppo, Tech news, Vivo

ఉత్తమ కథలు