హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Number Plate : కారు ధర రూ. 25 కోట్లు.. కానీ ఫ్యాన్సీ నెంబర్‌కు రూ. 52 కోట్లు

Number Plate : కారు ధర రూ. 25 కోట్లు.. కానీ ఫ్యాన్సీ నెంబర్‌కు రూ. 52 కోట్లు

బుగట్టి చిరోన్ కారు.. ఫ్యాన్సీ నెంబర్

బుగట్టి చిరోన్ కారు.. ఫ్యాన్సీ నెంబర్

వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ ధర కొనుగోలు చేసిన వాహనం ధర కంటే ఎక్కువగా ఉంటుంది..

  చాలా మందికి ఫ్యాన్సీ నెంబర్ ఫ్లేటు తీసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ అందరికీ సాధ్యపడదు.. ఎందుకంటే ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ ధర మనం కొనుగోలు చేసిన వాహనం ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ కార్ల విషయంలో ఫ్యాన్సీ నెంబర్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. అందుకు సంపన్నలు మాత్రమే ఇలాంటి నెంబర్ ప్లేట్స్ దక్కించుకోవాలని చూస్తుంటారు. తాజాగా దుబాయ్‌లో ఓ వ్యక్తి కళ్లు చెదిరే మొత్తానికి నెంబర్ ప్లేటు కొనుగోలు చేశాడు.

  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో బుగట్టి చిరోన్ ఒకటి. మార్కెట్లో ఈ కార్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అటువంటి ఖరీదైన కారును కొనుగోలు చేయడంమే కాకుండా.. ఫ్యాన్సీ నెంబర్ అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశాడు ఆ వ్యక్తి. రూ. 25 కోట్లు పెట్టి బుగట్టి చిరోన్ కారును కొనుగోలు చేశాడు. అంతేకాకుండా దాదాపు రూ. 52 కోట్లు వెచ్చించి.. ఆ కారుకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నాడు. భారీ మొత్తం చెల్లించి 9 నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు.

  ఇక, దుబాయ్‌లో ఈ ఫ్యాన్సీ నెంబర్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్సీ నెంబర్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీటిని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. గతేడాది దుబాయ్‌లో స్థిరపడిన ఒక భారతీయుడు తన ఫేవరేట్ నంబర్ ప్లేట్ కోసం సుమారు రూ. 60 కోట్లు ఖర్చుచేశాడు. ఇంకా యూఏఈలో ఇలాంటి నెంబర్ ప్లేట్స్ చాలానే ఉన్నాయి. ఇక, గతంలో యూకేలో 'ఎఫ్ 1' ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ రూ. 132 కోట్లు పలికింది.

  Published by:Anil
  First published:

  Tags: Automobiles, Dubai

  ఉత్తమ కథలు