Home /News /technology /

BUDGET SMARTWATCHES WANT TO BUY A SMARTWATCH THESE ARE THE BEST WATCHES AVAILABLE FOR LESS THAN RS 4000 GH VB

Budget Smartwatches: స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకొంటున్నారా..? రూ.4 వేలలోపు లభిస్తున్న బెస్ట్‌ వాచ్‌లు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌వాచ్‌లు ధరించే వారి సంఖ్య 2021వ సంవత్సరానికి 24 శాతం పెరిగింది. ట్రెండ్‌ పెరుగుతుండటంతో Noise, Amazefit, Redmi, Realme, Fire Boltt వంటి అనేక ప్రముఖ కంపెనీలు బడ్జెట్‌లో ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఇంకా చదవండి ...
స్మార్ట్‌వాచ్‌లు(Smartwatch) మార్కెట్‌లో(Market) చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో కొత్తగా వస్తున్న వివిధ ఫీచర్ల ద్వారా ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా యువతలో ప్రజాదరణ పొందుతున్నాయి. ఒక మంచి స్మార్ట్‌వాచ్ వారి అడుగుజాడలను ట్రాక్(Track) చేయడం, టెక్స్ట్‌లు, కాల్‌ల గురించి తెలియజేయడం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సేవలు అందించగలదు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లు ధరించే వారి సంఖ్య 2021వ సంవత్సరానికి 24 శాతం పెరిగింది. ట్రెండ్‌ పెరుగుతుండటంతో Noise, Amazefit, Redmi, Realme, Fire Boltt వంటి అనేక ప్రముఖ కంపెనీలు బడ్జెట్‌లో ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న రూ.4000లోపు బెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..

పెబుల్ కాస్మోస్ ప్రో, పెబుల్ లీప్(Pebble Cosmos Pro and Pebble Leap)
బ్రాండ్ పెబుల్ సోమవారం భారతదేశంలో రెండు బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. పెబుల్ కాస్మోస్ ప్రో 1.7 అంగుళాల కర్వ్డ్ HD డిస్‌ప్లేతో వస్తుంది. పెబుల్ లీప్ అనేది ఆల్-టెరైన్ దృఢమైన వాచ్‌. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు SpO2 ఆక్సిజన్, హృదయ స్పందన ట్రాకింగ్ కోసం ప్రత్యేక డ్యూయల్ సెన్సార్‌లతో పని చేస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రంగులలో లభిస్తున్నాయి. పెబుల్ కాస్మోస్ ప్రో 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. రూ.3,499 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. పెబుల్ లీప్‌లో సిలికాన్ పట్టీతో వాటర్‌ రెసిస్టెంట్‌ డయల్ ఉంది. అవుట్‌డోర్ యూసేజ్ కోసం 1.3-అంగుళాల HD డిస్‌ప్లే, ఆరోగ్య ప్రాణాధారాలను కొలవడానికి అధునాతన సెన్సార్‌లతో పని చేస్తుంది. లీప్ అమెజాన్, బ్రాండ్ వెబ్‌సైట్‌లో పరిమిత కాల ప్రారంభ ధర రూ.3,999కి అందుబాటులో ఉంది.

Laptops Under Rs 50K: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? రూ.50 వేలలోపు లభిస్తున్న బెస్ట్ మోడల్స్ ఇవే..


* ఫైర్-బోల్ట్ ఇన్‌క్రెడిబుల్‌(Fire-Boltt Incredible)
ఈ వాచ్‌ 28 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు ఆకట్టుకునే 1.3 రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్రీత్ ఎనలైజర్, హార్ట్ రేట్ ట్రాకింగ్, SPO2 మానిటర్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ సాధారణ మోడ్‌లో 7 రోజులు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.3,999 ధరకు అందుబాటులో ఉంది.

* నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 అసిస్ట్(Noise ColorFit Pro 3 Assist)
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3 స్మార్ట్‌వాచ్‌లో బిల్ట్‌ఇన్‌ అలెక్సా, 24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్, స్ట్రెస్ మానిటర్ , 14 స్పోర్ట్స్ మోడ్‌, 1.55 TruViewTM డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్‌కు సపోర్టు చేస్తుంది. వాచ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. చర్మానికి అనుకూలమైన సిలికాన్ పట్టీతో ఉంటుంది. వాచ్‌లోని 300mAh బ్యాటరీ 10 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.3,799 ధరకు అందుబాటులో ఉంది.

* అమాజ్‌ఫిట్ బిప్ ఎస్(Amazfit Bip S)
అమాజ్‌ఫిట్ బిప్ ఎస్ స్మార్ట్ వాచ్ 1.28 ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ GPS, 10 స్పోర్ట్స్ మోడ్‌లు, స్లీప్ మానిటర్, యాక్టివిటీ ట్రాకింగ్‌, హృదయ స్పందన రేటు, 5ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సాధారణ వినియోగానికి బ్యాటరీ 15 రోజులు వస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.3,499 ధరకు అందుబాటులో ఉంది.

* రియల్మీ వాచ్(Realme Watch)
రియల్మీ వాచ్ 1.4 పెద్ద కలర్ టచ్‌స్క్రీన్‌తో పాటు 14 స్పోర్ట్ మోడ్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం PPG సెన్సార్, SpO2, డిస్టెన్స్ ట్రాకర్, స్లీప్ మానిటర్‌ ఫీచర్లతో వస్తుంది. వాచ్ IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది. స్మార్ట్‌వాచ్‌ 160mAh (BIS) బ్యాటరీతో సాధారణ మోడ్‌లో 9 రోజులు, సేవింగ్ మోడ్‌లో 20 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.3,999 ధరకు అందుబాటులో ఉంది.

5G Smartphone Offer: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే

* రెడ్‌మి వాచ్ జీపీఎస్‌(Redmi Watch GPS)
రెడ్‌మి వాచ్ జీపీఎస్‌ 1.4 కలర్ డిస్‌ప్లే, 11 స్పోర్ట్స్ మోడ్‌లు, స్లీప్ మానిటర్, స్టెప్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ఇతర ఫీచర్లతో పాటు ఇన్-బిల్డ్ GPSతో వస్తుంది. 200 దాటిన వాచ్ ఫేస్‌లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. 230mAh బ్యాటరీతో సాధారణ వినియోగ మోడ్‌లో 10 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ రూ.3,999 ధరకు అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Smartwatch, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు