ఫెస్టివల్ సీజన్లో (Festival Session) ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ ఆఫర్లలో చాలామంది కొత్త స్మార్ట్ఫోన్లను (New Smartphone) కొనుగోలు చేశారు. అయితే మీరు బడ్జెట్ ఫోన్‌ను (Budget Session) కొనాలని ప్లాన్ చేస్తుంటే.. వీలైనంత త్వరగా కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే వచ్చే నెల నుంచి మన దేశంలో బడ్జెట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
సగటున రూ.3000 పెరిగే అవకాశం
బడ్జెట్ స్మార్ట్ఫోన్ల ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఈటీ టెలికామ్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో దేశంలో వీటి సగటు విక్రయ ధర రూ.17,000 నుంచి రూ. 20,000కి పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ వెల్లడించింది. మొబైల్ కంపెనీలు అక్టోబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య కొత్త ధరలను ప్రకటించే అవకాశం ఉంది. ఫెస్టివల్ సీజన్లో మార్కెట్ పెంచుకోవడం కోసం చాలా బ్రాండ్స్ తమ ఫోన్లను నష్టానికి విక్రయిస్తున్నాయి. మరోపక్క రూపాయితో డాలర్ మారకం విలువ భారీగా పెరుగుతుండడంతో ఉత్పాదక వ్యయం పెరుగుతోంది. దీంతో ఆఫర్లు ముగిసిన తర్వాత ఈ భారాన్ని మొబైల్ కంపెనీలు కస్టమర్లపై మోపనున్నాయి.
55 inch Smart TV: అదిరిపోయే ఆఫర్... రూ.30 వేల లోపే 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీ... 3 రోజులే ఛాన్స్
ఇప్పుడు కొనటం మంచిది
కస్టమర్లు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఈ ఫెస్టివల్ సీజన్ మంచి సమయం. ఎందుకంటే ఆఫర్లు, డిస్కౌంట్లతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. కంపెనీలు కూడా ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేసేందుకు భారీ ఆఫర్లతో ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నాయి. అయితే దేశంలోకి వచ్చే కొత్త స్టాక్ మాత్రం, పెరిగిన ఖర్చులతోనే లభిస్తుంది. కాబట్టి కొత్త ధరలను త్వరలోనే కంపెనీలు ప్రకటించే అవకాశం ఉంది.
ధరల పెంపు ఎందుకు?
ప్రస్తుతం డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం రూపాయితో డాలర్ మారకం విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.82 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ బ్రాండ్స్ దిగుమతి చేసుకుంటున్న కాంపోనెంట్స్ (విడి భాగాలు) కోసం అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఈ కాంపోనెంట్స్, స్థానికంగా తయారవుతున్న ఫోన్లలో అతి పెద్ద భాగంగా ఉన్నాయి. దీంతో కంపెనీలు తమ మొబైల్ ఫోన్ల ధరలను పెంచాల్సి వస్తుంది. చివరికి ఆ భారం కస్టమర్లపై పడనుంది.
ఈ బ్రాండ్స్ కూడా..
ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రీమియం ప్రొడక్ట్స్ ధరలను పెంచేసింది. ఈ జాబితాలో ఐపాడ్, ఐఫోన్ SE 2022 ఉన్నాయి. ఇక, రాబోయే రోజుల్లో షియోమీ, రియల్మీ , వన్ ఫ్లస్, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్స్ కూడా తమ స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచే అవకాశం ఉంది. మరోపక్క దేశంలో 5జీ నెట్వర్క్ రాకతో మార్కెట్ లో 5జీ ఫోన్స్ సందడి చేస్తున్నాయి. దీంతో ఫోన్ సగటు బేస్ ధర రూ.15000కు పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Offers, Smartphones