హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Budget Smart TV: రూ. 20 వేలలోపు బెస్ట్​ బడ్జెట్​ స్మార్ట్​టీవీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే, వీటిని తప్పక పరిశీలించండి..

Budget Smart TV: రూ. 20 వేలలోపు బెస్ట్​ బడ్జెట్​ స్మార్ట్​టీవీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే, వీటిని తప్పక పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్ ధరలోనే బెస్ట్​ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నా?.. స్మార్ట్​టీవీ బ్రాండ్​, డిస్​ప్లే, సౌండ్ క్వాలిటీ, కనెక్టివిటీ ఆప్షన్లు, ధర వంటి అంశాలను తప్పక పరిశీలించాలి.  

భారతదేశంలో సాధారణ టీవీల కంటే స్మార్ట్ టీవీలకు(Smart Tv) ఫుల్ డిమాండ్ ఉంటుంది. బడ్జెట్(Budget) ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బడ్జెట్​ స్మార్ట్​టీవీల్లో సంప్రదాయ టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ కంటెంట్​ను కూడా యాక్సెస్​ చేయవచ్చు. మీరు సాధారణ టీవీ నుండి స్మార్ట్​టీవీకి అప్‌గ్రేడ్ అవుతున్నా? లేదా బడ్జెట్ ధరలోనే బెస్ట్​ స్మార్ట్ టీవీ(Best Smart TV) కోసం చూస్తున్నా?.. స్మార్ట్​టీవీ బ్రాండ్​, డిస్​ప్లే, సౌండ్ క్వాలిటీ, కనెక్టివిటీ ఆప్షన్లు, ధర వంటి అంశాలను తప్పక పరిశీలించాలి.

భారతదేశంలో టాప్ బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్లు

భారత్​లో బడ్జెట్ స్మార్ట్ టీవీలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు ఇప్పటికే ఉన్న బ్రాండ్లతో పాటు అనేక కొత్త స్మార్ట్​బ్రాండ్లు స్మార్ట్​టీవీ మార్కెట్​లోకి అడుగుపెడుతున్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్‌లో షియోమి, వన్​ప్లస్​, రియల్​మీ, వీయూ, రెడ్​మీ, శామ్​సంగ్​, టీసీఎల్​, హిస్సెన్స్​ వంటి టాప్​ టాప్ బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్లు హవా కొనసాగిస్తున్నాయి.

Holika Dahan: హోలీ వేడుకలకు సిద్ధమవుతున్న భారతీయులు.. పూజా పద్ధతులు, శుభ గడియల వివరాలు..

టాప్ బడ్జెట్ స్మార్ట్ టీవీ మోడల్స్

ఈ బ్రాండ్‌లన్నింటికీ ఆయా సెగ్మెంట్లలో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొనుగోలు సమయంలో ఆండ్రాయిడ్​ TV, స్మార్ట్ టీవీ మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. మీరు సరైన ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి బ్రాండ్ పేరు లేదా ఉత్పత్తి వివరాలను పరిశీలించండి. బడ్జెట్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు.. బ్రాండ్‌ పేరు, సెగ్మెంట్‌లో ఉన్న ఉత్పత్తులలను పరిశీలించండి. మీ అవసరాలు, బడ్జెట్​ను బట్టి ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ టీవీని ఎంచుకోండి.

టీవీ డిస్​ప్లే టైప్​

స్మార్ట్​టీవీని ఎంచుకునే క్రమంలో డిస్​ప్లే టైప్​ కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం బడ్జెట్ విభాగంలో అనేక బ్రాండ్లు తమ స్మార్ట్ టీవీలను ఎల్​ఈడీ ప్యానెల్‌లతో అందిస్తున్నాయి. గతంలో ఎల్​సీడీ టీవీలను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఎల్​ఈడీ స్మార్ట్​టీవీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దాదాపు అన్ని స్మార్ట్ టీవీలు ఇప్పుడు LED ప్యానెల్‌తో వస్తున్నాయి.

టీవీ స్క్రీన్ సైజ్​

బడ్జెట్ స్మార్ట్ టీవీ సెగ్మెంట్ రెండు స్క్రీన్ పరిమాణాల్లో టీవీలను అందిస్తుంది. చాలా బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను 32- అంగుళాల స్క్రీన్‌తో అందిస్తాయి. కొన్ని 40 -అంగుళాల టీవీలను కూడా లాంచ్​ చేస్తున్నాయి. ఏ సైజు టీవీని ఎంచుకోవాలనేది మీ గది పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మీ వీక్షణ ప్రాంతం నుండి టీవీ దూరం, మీరు టీవీని గోడపై మౌంట్ చేయాలనుకుంటున్నారా? లేదా టేబుల్​పై ఉంచాలనుకుంటున్నారా? అనే విషయాలను బట్టి మీ ఇంటికి సరైన టీవీ స్క్రీన్​ను ఎంచుకోండి.

Rent AC Online: సమ్మర్ కోసం ఏసీ కొంటారా? ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకోండిలా

స్క్రీన్ రిజల్యూషన్

స్మార్ట్​టీవీల ఎంపికలో స్క్రీన్​ రిజల్యూషన్​ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విడుదలవున్న స్మార్ట్​టీవీలు హెచ్​డీ రిజల్యూషన్‌తో వస్తున్నాయి. ఇవి 768 పిక్సెల్‌ల క్వాలిటీని కలిగి ఉంటాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ హెచ్​డీ డైరెక్ట్ టు హోమ్ (DTH) సెట్-టాప్ బాక్స్‌లు హై క్వాలిటీ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. మీకు ఫుల్​ హెచ్​డీ స్క్రీన్ టీవీని అందించే కొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయి. కానీ, వాటిలో హై క్వాలిటీ ప్యానెల్ ఉండకపోవచ్చు. అందుకే, హెచ్​డీ డిస్‌ప్లే ఉన్న స్మార్ట్​టీవీని ఎంచుకోండి.

కనెక్టివిటీ ఆప్షన్లు

స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన అంశం. మీరు కొనుగోలు చేస్తున్న టీవీలో రెండు కాకపోయినా కనీసం ఒక HDMI పోర్ట్ ఉందని నిర్ధారించుకోండి. లేకపోతే, లైవ్​ టీవీ ఛానెల్‌ల కోసం సెట్-టాప్-బాక్స్‌ని కనెక్ట్ చేయలేరు. కొన్ని బడ్జెట్ టీవీలు వైఫైతో పాటు బ్లూటూత్‌ కనెక్టివిటీకి మద్దతిస్తాయి. ఇవి USB పోర్ట్‌లను కలిగి ఉంటాయి. తద్వారా మీరు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్​లను స్మార్ట్​టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.

యాప్ సపోర్ట్​​

స్మార్ట్​టీవీల ఎంపికలో యాప్​ సపోర్ట్​ కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రస్తుతం, మార్కెట్​లో ఉన్న అన్ని స్మార్ట్ టీవీల్లో యాప్‌ సపోర్ట్​ ఉండటం లేదు. కాబట్టి, మీరు బడ్జెట్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే సమయంలో యాప్​ సపోర్ట్​ ఉందని నిర్ధారించుకోండి. లేదంటే, తగిన యాప్ సపోర్ట్, అప్‌డేట్‌లను పొందడానికి ఎక్స్‌టర్నల్ స్ట్రీమింగ్ పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సౌండ్ క్వాలిటీ

స్మార్ట్​టీవీ ఎంపికలో సౌండ్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. సాధారణంగా బడ్జెట్​ స్మార్ట్ టీవీలు ప్రాథమిక సౌండ్ అవుట్‌పుట్ ఇచ్చే ఇన్​బిల్ట్​ స్పీకర్లతో వస్తాయి. అందువల్ల, సౌండ్ క్వాలిటీని పరిశీలించి స్మార్ట్​టీవీని కొనుగోలు చేయండి.

ధర

బడ్జెట్ స్మార్ట్ టీవీ మార్కెట్ రూ. 10,000 నుండి మొదలై రూ. 20,000 వరకు ఉంటుంది. ఈ టీవీల ధరను బట్టి ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. మీ ప్రాధాన్యతల అనుగుణంగా బడ్జెట్​ స్మార్ట్​టీవీని ఎంచుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Budget smart tv, Price, Smart TV, Sound, Top brands

ఉత్తమ కథలు