Budget Phones: మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లు.... ధ‌ర ఎంతో తెలుసా

(ప్రతీకాత్మక చిత్రం)

మార్కెట్‌లో ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స్మార్ట్ ఫోనులు వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కే అన్ని ర‌కాల ఫీచ‌ర్‌(Features)ల‌తో ఫోన్‌ను అందిస్తున్నాయి. కొత్త‌గా హాంకాంగ్‌(Hong Kong)కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్(Infinix) మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌(Smart Phone)ను ప్ర‌వేశ పెట్ట‌బోతోంది.

  • Share this:
    మార్కెట్‌లో ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స్మార్ట్ ఫోను వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కే అన్ని ర‌కాల ఫీచ‌ర్‌ల‌తో ఫోన్‌ను అందిస్తున్నాయి. కొత్త‌గా హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్(Infinix) మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌(Smart Phone)ను ప్ర‌వేశ పెట్ట‌బోతోంది. సెప్టెంబర్‌లో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ప్రతినిధులు ప్ర‌క‌టించారు.

    ఫీచ‌ర్లు ఇవే..
    - రెండు మెమరీల మోడ‌ల్స్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది
    - 4జీబీ RAM, 64జీబీ స్టోరేజ్,6జీబీ RAM, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 ధర రూ.9,999గా ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.
    - మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం పూర్తి  వివ‌రాలు సంస్థ విడుద‌ల చేయాల్సి ఉంది.

    Apple iPhone 13: మార్కెట్లోకి ఐఫోన్ 13.. సెప్టెంబ‌ర్ 14 నుంచి ప్రీఆర్డ‌ర్ బుకింగ్‌


    ఇప్పటికే ఇన్ఫినిక్స్‌ నోట్‌ 7, ఇన్ఫినిక్స్‌ హాట్‌ 9, ఇన్ఫినిక్స్‌ హాట్‌ 10ఎస్‌ బడ్జెట్‌ ఫోన్లతో దేశీయ మార్కెట్‌లో స్థానం సంపాందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ఇన్ఫినిక్స్ కొత్త‌గా ఇన్ఫినిక్స్‌ హాట్ 11ను ప్ర‌క‌టించింది.
    రూ.9.000కే రియ‌ల్‌మి సీ21వై..
    చైనాకు చెందిన మొబైల్ త‌యారీ దిగ్గ‌జం అయిన రియ‌ల్‌మి(RealMe) కంపెనీ అతి త‌క్కు ధ‌ర‌కు వినియోగ‌దారులకు రూ.9వేల‌కే ఫోన్ అందించ‌నుంది. రియ‌ల్‌మీ సీ21వై ద్వారా ప‌లు ఫీచ‌ర్‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను(Smart Phone) ఆగ‌స్టు 23, 2021న ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 20:9 డిస్ ప్లేతో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. బ్యాట‌రీ ప‌వ‌ర్ 5000mHAతో మ‌న్నిక‌గా ఇచ్చింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్(Video Record) చేయవచ్చు. మొత్తం మీద రియల్‌మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది.
    Published by:Sharath Chandra
    First published: