Home /News /technology /

BUDGET ANDROID PHONE LAVA AGNI 5G AT A HUGE DISCOUNT AND GET FREE LAVA FREE PROBUDS WORTH 1799 RUPEES NS

Amazon Offers: అమెజాన్ లో అదిరే ఆఫర్.. ఈ ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. ఆఫర్ వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ప్రతిరోజూ కొత్త డీల్స్, డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు కూడా కొత్త ఫోన్ మరియు ఇయర్‌బడ్ కోసం చూస్తున్నట్లయితే, మీకో శుభవార్త.

    ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ప్రతిరోజూ కొత్త డీల్స్, డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు కూడా కొత్త ఫోన్ మరియు ఇయర్‌బడ్ కోసం చూస్తున్నట్లయితే, మీకో శుభవార్త. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉన్న ఫోన్‌ను కొంటే మీరు ఇయర్‌బడ్‌లను ఉచితంగా పొందవచ్చు Amazonలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. Lava Agni 5G ఫోన్ అసలు ధర రూ.23,999 కాగా ఈ ఫోన్ పై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ. 17,990కే సొంతం చేసుకోవచ్చు. విశేషమేమిటంటే ఈ ఫోన్‌తో వినియోగదారులకు లావా ప్రోబడ్స్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. దీని ధర రూ.1,799.

    ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని 64 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా, 5000mAh బ్యాటరీ. దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆక్టా కోర్ MediaTek Dimension 810 SoC ప్రాసెసర్ ఫోన్‌లో ఇవ్వబడింది. మరియు ఇది 8GB RAMతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత నిల్వను కలిగి ఉంది. Lava Agni 5 Android 11 పై రన్ అవుతుంది.

    64 మెగాపిక్సెల్ కెమెరా
    కెమెరా విషయానికి వస్తే.. ఇది 64 మెగాపిక్సెల్‌ల ప్రాథమిక సెన్సార్‌ను కలిగి ఉంది. దానితో ఎఫ్ / 1.79 సిక్స్-పీస్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, కెమెరాలో 15-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ ఇవ్వబడింది. మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ సెటప్‌ ఉంటుంది. ఇందులో AI మోడ్, సూపర్ నైట్ మోడ్ మరియు ప్రో మోడ్ వంటి ప్రీ-లోడ్ చేయబడిన కెమెరా మోడ్‌లను కస్టమర్‌లు పొందుతారు. సెల్ఫీ మరియు వీడియో చాట్ కోసం లావా అగ్ని 5Gలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఇవ్వబడింది.


    పవర్ కోసం.. లావా ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 90 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇది 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Amazon, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు