హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

BSNL prepaid plans: BSNL వినియోగదారులకు అలర్ట్.. ఆ రీఛార్జ్ ప్లాన్లు రద్దు.. పూర్తి వివరాలివే

BSNL prepaid plans: BSNL వినియోగదారులకు అలర్ట్.. ఆ రీఛార్జ్ ప్లాన్లు రద్దు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొన్ని రీఛార్జ్ ప్లాన్లలను తమ సర్వీస్ జాబితా నుంచి తొలగించనుంది. దీంతో పాటు కొన్ని ప్రీపెయిడ్ డేటా ప్లాన్లలో మార్పులు సైతం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టెలికాం విభాగంలో నెలకొన్న పోటీని ప్రభుత్వ రంగ సంస్థ BSNL తట్టుకోలేకపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రంగంలోకి జియో ప్రవేశించిన తరువాత పోటీ సంస్థలన్నీ డేటా ప్లాన్ల ధరలను భారీగా తగ్గించాల్సిన తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు నెట్‌వర్క్ ప్రొవైడింగ్ సంస్థలు డేటా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో BSNL కొన్ని రీఛార్జ్ ప్లాన్లలను తమ సర్వీస్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. సంస్థ అందిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ డేటా ప్లాన్లలో మార్పులు చేస్తోంది. BSNL తాజాగా నాలుగు రీఛార్జ్ ప్లాన్లను ఆపేసింది. రూ.47 రీఛార్జ్ కూపన్, రూ.109 ప్లాన్ వోచర్, రూ.998 స్పెషల్ టారిఫ్ వోచర్, రూ.1098 రీఛార్జ్ ప్లాన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇప్పటికే ఈ నాలుగు ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్నవారికి, వ్యాలిడిటీ ఉన్నంతవరకు ప్రయోజనాలు కొనసాగుతాయి. ఆ తరువాత వీరు అందుబాటులో ఉన్న ఇతర రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. తాజాగా రూ.197 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సంస్థ ప్రారంభించింది. ఈ ప్యాకేజీని ఎంచుకున్నవారు ప్రతిరోజూ 2GB డేటాను, 100 SMSలు, జీ మ్యూజిక్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను 18 రోజుల పాటు పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 180 రోజులుగా ఉంది. అంటే మొత్తం 180 రోజుల వరకు సిమ్ యాక్టివేషన్‌లో ఉంటుంది.

-ప్రస్తుతం ఉన్న రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను BSNL రూ.32 పెంచింది. ఇప్పుడు ఈ యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.397తో అందిస్తోంది. దీంతో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 SMSలు, 60 రోజుల పాటు 2GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ 365 రోజులు.

-రూ.249 ప్లాన్‌ను ఎంచుకున్నవారు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, రోజూ 1GB వరకు డేటాను పొందవచ్చు. ఆ తరువాత డేటా స్పీడ్ తగ్గుతుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు.

-రూ. 298 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కూడా కస్టమర్లు ఇవే ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా ఈరోస్ నౌ స్ట్రీమింగ్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. కానీ దీని వ్యాలిడిటీ మాత్రం 56 రోజుల వరకే ఉంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: BSNL, Jio

ఉత్తమ కథలు