బీఎస్ఎన్ఎల్‌ నుంచి 5జీ సర్వీస్!

ప్రపంచవ్యాప్తంగా 5జీ సర్వీసులపై ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ కంపెనీలతో కలిపి తాము కూడా 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్‌ఎన్ఎల్ ప్రకటించింది.

news18-telugu
Updated: July 17, 2018, 12:12 PM IST
బీఎస్ఎన్ఎల్‌ నుంచి 5జీ సర్వీస్!
(Image: Alexander Supertramp/shutterstock.com via AFP Relaxnews)
  • Share this:
ప్రపంచవ్యప్తంగా 5జీ సేవలు ఎప్పుడు మొదలైతే అప్పుడు ఇండియాలో తాము కూడా ఆ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కంటే ముందు ఇండియాలో ఏ కంపెనీ కూడా 5జీ సేవల్ని ప్రారంభించలేదని ధీమా వ్యక్తం చేస్తోంది ఆ కంపెనీ. జూన్ 2020 నాటికి 5జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతాయి. అంతకంటే ముందే అంటే 2019లోనే 5జీని భారతీయులకు ఈ సేవల్ని అందించగలమంటున్నారు కంపెనీ ఉన్నతాధికారులు. తాము 4జీని అందుకోలేకపోయామని, అందుకే 5జీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 5జీ సేవల కోసం నోకియా, ఎన్‌టీటీ అడ్వాన్స్ టెక్నాలజీ లాంటి అంతర్జాతీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది బీఎస్ఎన్ఎల్.
First published: July 17, 2018, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading