బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లబించనుంది.ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌‍తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తున్నాయి.

news18-telugu
Updated: October 2, 2018, 10:06 AM IST
బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 2, 2018, 10:06 AM IST
మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ లేదా? ఇందుకోసం మీరు రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే చాలు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభిస్తుంది.

అమెజాన్ ఇండియాతో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రకటించిన ఆఫర్ ఇది. రూ.399 కన్నా ఎక్కువ ప్లాన్‌తో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్, రూ.745 కన్నా ఎక్కువ బ్రాడ్‌‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలి. ఏడాదిపాటు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు.

ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌‍తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?


ఇప్పటికే మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లయితే రూ.399 కన్నా ఎక్కువ ప్లాన్, బ్రాడ్‌బ్యాండ్ అయితే రూ.745 కన్నా ఎక్కువ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి.
బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'బీఎస్ఎన్ఎల్-అమెజాన్ ఆఫర్' బ్యానర్‌పై క్లిక్ చేయాలి.
మీ బీఎస్ఎన్ఎల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ జెనరేట్ చేయాలి.
Loading...
ఓటీపీఎంటర్ చేసి ఆఫర్‌ని యాక్టివేట్ చేయాలి.
ఇక అమెజాన్‌తో పాటు ప్రైమ్ వీడియోలో లాగిన్ చేసి ప్రైమ్ సేవల్ని పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
First published: October 2, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...