రిపబ్లిక్ డే రోజు BSNL బంపర్ ఆఫర్...రూ.1999 రీచార్జ్ చేస్తే...

ఈ ఆఫర్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.అయితే ఈ ఆఫర్ 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది.

news18-telugu
Updated: January 26, 2020, 8:00 AM IST
రిపబ్లిక్ డే రోజు BSNL బంపర్ ఆఫర్...రూ.1999 రీచార్జ్ చేస్తే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
71 వ రిపబ్లిక్ డే సందర్భంగా BSNL తన చందాదారులకు భారీ ఆఫర్ ను ప్రకటించింది. BSNL రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. BSNL అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటు ఉంది. అయితే ఈ ఆఫర్‌తో ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజుల వరకూ ఎక్స్‌టెండ్ అయ్యింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.అయితే ఈ ఆఫర్ 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది. BSNL నుండి వస్తున్న ఈ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న, క్రొత్త కస్టమర్లకు అందుబాటులో ఉంది. కొత్త BSNL చందాదారులు తమ మొదటి రీఛార్జ్ ఎంపికగా రూ.1,999 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
Published by: Krishna Adithya
First published: January 26, 2020, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading