BSNL RS 599 WORK FROM HOME PLAN GIVES 5GB DAILY DATA FOR 84 DAYS HERE ALL OFFERS DETAILS NS GH
Work From Home చేసే వారికి BSNL బంపరాఫర్.. ఈ ప్లాన్ తో ఏకంగా డైలీ 5 జీబీ ఫ్రీ డేటా.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
BSNL సరికొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ. 599లకే 84 రోజుల వ్యాలిడిటీ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద నిత్యం 5 జీబీ డైలీ డేటా లభిస్తుంది.
కరోనా (Corona) తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కల్చర్ పెరిగింది. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులంతా వర్క్ ఇంటి నుంచే చేస్తున్నారు. వీరి అవసరాలకు తగ్గట్లు ప్రముఖ టెల్కో కంపెనీలు సరికొత్త డేటా ప్లాన్లను (Data Plans) ప్రవేశపెడుతున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ. 599లకే 84 రోజుల వ్యాలిడిటీ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ 5 జీబీ డేటా ఆఫర్ చేస్తుంది. అయితే, స్పీడ్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అవసరం లేని వినియోగదారులు రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఎంచుకోవచ్చు.
రూ. 599 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రమ్ హోమ్ STV 599 ప్లాన్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ 5జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ప్రతి రోజూ 5 జీబీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత, డేటా స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది. MTNL నెట్‌వర్క్‌లతో సహా ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ప్లాన్ కింద రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తుంది. బీఎస్ఎన్ల్ వెబ్సైట్ లేదా సెల్ఫ్-కేర్ యాక్టివేషన్ ద్వారా ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ. 251 ధరతో వర్క్ -ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు 70 జీబీ డేటాను అందిస్తుంది. BSNL Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి మరో 4 ప్రీపెయిడ్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్ లేదా ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలను పొందాలనుకుంటే విడిగా రీఛార్జ్ చేసుకోవాలి. బీఎస్ఎన్ఎల్ రూ. 151 ధరతో వర్క్-ఫ్రమ్-హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో 40 జీబీ డేటాను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లు పాన్ ఇండియా కస్టమర్లందరికీ వర్తిస్తాయి. వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ఆన్లైన్ రీఛార్జ్ పోర్టల్, మై బీఎస్ఎన్ఎల్ యాప్, రిటైలర్, ఇతర థర్డ్-పార్టీ సైట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. BSNL Offer: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. ఈ యాన్యువల్ ప్లాన్‌పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీ..
ఇక, ప్రైవేట్ టెల్కో సంస్థ వొడాఫోన్ ఐడియా రూ. 298, రూ. 418 ధరలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ వర్క్-ఫ్రమ్-హోమ్ ప్లాన్లు వరుసగా 28 రోజులు, 56 రోజుల పాటు 50 జీబీ, 100 జీబీ డేటాను అందిస్తాయి. అదనంగా వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది. జియో రూ.181, రూ.241, రూ. 301 వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ల కింద వరుసగా 30 జీబీ, 40 జీబీ, 50 జీబీ డేటా లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.