Mobile Recharge | మార్కెట్‌లో ప్రస్తుతం పలు రకాల టెలికం కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ దిగ్గజాలతో పాటుగా బీఎస్‌ఎన్ఎల్ (BSNL) ప్రభుత్వ రంగ కంపెనీ కూడా ఉంది. ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన ప్రిపెయిడ్ ప్లాన్స్‌ను కస్టమర్లకు అందిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు అన్నింటిలో కెల్లా మోస్ట్ పాపులర్ రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోవబోతున్నాం. అదే బీఎస్‌ఎన్ఎల్ రూ. 319 రీచార్జ్ ప్లాన్.
కంపెనీ ఈ 319 రీచార్జ్ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ అందిస్తోంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్ కింద 300 ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు. ఇంకా 10 జీబీ డేటా వస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ 65 రోజులు. అంటే ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీచార్జ్ చేస్తే మళ్లీ 65 రోజుల వరకు రీచార్జ్ అవసరం ఉండదు.
ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. చౌక ధరకే లభిస్తున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
రీచార్జ్ ప్లాన్ ధర రూ.319గా ఉంది. 65 రోజుల వాలిడిటీ. అంటే ఈ లెక్కన చూస్తే.. రోజుకు రూ. 4.9 ఖర్చుతో మీరు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చని చెప్పుకోవచ్చు. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌ను ఒకసారి పరిశీలించండి. తక్కువ ధరలోనే ఆకర్షణీయ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు.
ఉద్యోగులకు కేంద్రం షాక్.. కీలక ప్రకటన!
అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ ఇతర రీచార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంచింది. బీఎస్ఎన్ఎల్ రూ. 18 ప్రారంభ ధర నుంచి వాయిస్ వోచర్లను అందుబాటులో ఉంచింది. మీకు నచ్చిన ప్లాన్‌తో మీరు బీఎస్ఎన్ఎల్ నెంబర్ రీచార్జ్ చేసుకోవచ్చు. రూ. 18, రూ. 35, రూ. 36, రూ. 48, రూ. 49, రూ. 87, రూ. 99, రూ. 118 ఇలా పలు రకాల రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం రీచార్జ్ మాత్రమే కాకుండా మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.
మీరు మీకు నచ్చిన ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ నెంబర్ రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి రీచార్జ్ ప్లాన్‌ను రీచార్జ్ చేస్తే.. ఆ డబ్బులు వెనక్కి రావు. అందుకే నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు, ప్లాన్ ఎంపిక విషయంలో ఆచీ తూచీ వ్యవహరించారు. అన్ని ఫీచర్లు తెలుసుకున్న తర్వాతనే రీచార్జ్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. అలాగే మీ ఫోన్ నెంబర్ వాలిడిటీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాలిడిటీ అయిపోయిన తర్వాత వేరే రీచార్జ్ చేస్తే ఆ డబ్బులు రాకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio plans, Reliance Jio