news18-telugu
Updated: December 5, 2019, 6:18 PM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... 500 జీబీ డేటాతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లకు గుడ్ న్యూస్. రూ.777 ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్ కొత్తేమీ కాదు. యూజర్లకు ఇంతకుముందు పరిచయం ఉన్న ప్లానే. కానీ... కొన్నినెలల క్రితం ఈ ప్లాన్‌ను నిలిపివేసింది. మళ్లీ అదే ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇలా ఈ ప్లాన్‌ను నిలిపివేయడం, మళ్లీ తీసుకురావడం మామూలే. ఈసారి కాస్త మార్పులతో, కొత్త బెనిఫిట్స్‌ని ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లు 50 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. 500 జీబీ డేటా లభిస్తుంది. 500 జీబీ డేటా వాడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వేలిడిటీ 6 నెలలు. సబ్స్క్రైబర్లకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్లిమిటెడ్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ వేలిడిటీ ముగిసిన తర్వాత రూ.999 ప్లాన్‌కు మారిపోయేలా నియమనిబంధనలున్నాయి. అందులో 600 జీబీ డేటా లభిస్తుంది. రూ.777 డేటా ప్లాన్ అందరికీ కాదు. కొత్తవారికి మాత్రమే.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు రూ.777 ప్లాన్ బాగా పరిచయం ఉన్నదే. కానీ... ఈ ప్లాన్ ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పుడు మళ్లీ రూ.777 ప్లాన్‌ను ప్రకటించినా... ఈసారైనా బ్రేక్ లేకుండా ఈ ప్లాన్ కొనసాగుతుందా అన్న అనుమానాలున్నాయి. ఇక ఇటీవల బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ.555 ప్లాన్‌ను కూడా పరిచయం చేసింది.
Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Jio New Plans: రిలయెన్స్ జియో నుంచి 11 బెస్ట్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
WhatsApp Privacy: మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చడానికి సెట్టింగ్స్ ఇవే...Gold: తక్కువ రేటుకే బంగారం... రేపు ఒక్క రోజే అవకాశం
Published by:
Santhosh Kumar S
First published:
December 5, 2019, 6:18 PM IST