BSNL WiFi: ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై... కనెక్ట్ చేయండి ఇలా

BSNL Wifi Hotspot | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్. తమ యూజర్ల కోసం పబ్లిక్ ప్లేస్‌లో ఉచిత వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేస్తోంది బీఎస్ఎన్ఎల్.

news18-telugu
Updated: May 15, 2020, 2:42 PM IST
BSNL WiFi: ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై... కనెక్ట్ చేయండి ఇలా
BSNL WiFi: ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై... కనెక్ట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పబ్లిక్ ప్లేస్‌లో బీఎస్ఎన్ఎల్ వైఫై హాట్‌స్పాట్ జోన్లల్లో ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లు ఇతర పబ్లిక్ ప్లేస్‌లో బీఎస్ఎన్ఎల్ వైఫై హాట్‌స్పాట్ అందుబాటులో ఉంటుంది. అయితే బీఎస్ఎన్ఎల్ యూజర్లు మాత్రమే ఫ్రీ వైఫై వాడుకోవచ్చు. ఇందుకోసం యూజర్ల దగ్గర స్మార్ట్‌ఫోన్, అందులో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉండాలి. ఉచిత వైఫై కొంత లిమిట్ మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత ఓచర్ రీఛార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలో మిగతా ప్రాంతాల్లో ఫ్రీ వైఫై సేవలు ప్రారంభమవుతాయి.

BSNL WiFi Hotspot: బీఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా



మీరు బీఎస్ఎన్ఎల్ వైఫై హాట్‌స్పాట్ ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు ముందుగా వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
బీఎస్ఎన్ఎల్ వైఫై కోసం సెర్చ్ చేయండి. లిస్ట్‌లో BSNL WiFi కనిపిస్తే connect ఫైన క్లిక్ చేయండి.
మీ బీఎస్ఎన్ఎల్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీ స్మార్ట్‌ఫోన్‌కు 6 అంకెల పిన్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.
6 అంకెల పిన్ ఎంటర్ చేసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ వైఫై కనెక్ట్ అవుతుంది.ఇవి కూడా చదవండి:

Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

IRCTC Refund: జూన్ 30 వరకు రైళ్లు రద్దు... రీఫండ్ రూల్స్ ఇవే

LIC Policy: రోజుకు రూ.28 పొదుపుతో రూ.3.97 లక్షలు రిటర్న్స్
Published by: Santhosh Kumar S
First published: May 15, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading