Mobile Recharge | దేశీ దిగ్గజ టెలికం రంగ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు చౌక ధర రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. మనం ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ప్లాన్స్‌లో ట్రెండింగ్ రీచార్జ్ ప్లాన్స్ (Recharge Plan) ఏంటివో ఒకసారి తెలుసుకుందాం. ఇందులో రూ. 153 రీచార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 26 రోజుల వాలిడిటీ లభిస్తుంది. 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ వంటివి పొందొచ్చు. ఫ్రీ బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.
అలాగే బీఎస్ఎన్ఎల్ రూ. 229 ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్ కింద కస్టమర్లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే ఛాలెంజ్ ఎరీనా మొబైల్ గేమ్ ఆడొచ్చు. అలాగే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 397 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 150 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. అయితే ఈ ఫ్రీబీస్ అన్ని 30 రోజులే లభిస్తాయి.
ఈ సిమ్ కార్డు వాడే వారికి భారీ షాక్.. మరోసారి ఫోన్ రీచార్జ్ ధరల పెంపు?
అలాగే కంపెనీ నుంచి రూ. 666 రీచార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 105 రోజులు. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. ఇంకా బీఎస్‌ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ మ్యూజిక్, అస్ట్రోలాడ్ గేమ్ ఆన్ వంటి సర్వీసులు లభిస్తాయి.
సైలెంట్‌గా షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. కస్టమర్లకు ఝలక్!
ఇక చివరిగా రూ. 1198 ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే మీరు రోజుకు రూ. 3.28 ఖర్చుతో ఈ ప్లాన్ నుంచి బెనిఫిట్స్ పొందొచ్చు. నెలకు 300 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 3 జీబీ డేటా వస్తుంది. నెలకు ఇది వర్తిస్తుంది. అలాగే నెలకు 30 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్స్ చాలా సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు కూడా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. అదిరే బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. కాగా మొబైల్ రీచార్జ్ చేసుకునే సమయంలో మీ అసవరాలకు అనుగుణంగా ప్లాన్ ఎంచుకోండి. ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. తర్వాత ఆ ప్లాన్ అయిపోయేంత వరకు ఏమీ చేయడానికి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSNL, Mobile recharge, Recharge, Recharge plans