BSNL: బీఎస్​ఎన్​ఎల్ కస్టమర్లకు​ బంపరాఫర్​... ఆ ప్లాన్​పై అదనపు బెనిఫిట్స్

BSNL: బీఎస్​ఎన్​ఎల్ కస్టమర్లకు​ బంపరాఫర్​... ఆ ప్లాన్​పై అదనపు బెనిఫిట్స్​ (ప్రతీకాత్మక చిత్రం)

BSNL | బీఎస్ఎన్ఎల్ రూ.599 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌పై అదనపు బెనిఫిట్స్ ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) వరుస ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కరోనా మహమ్మారి వల్ల వర్క్​ ఫ్రమ్ హోమ్​ కల్చర్​ విస్తరించడంతో ఇటీవల వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో రూ. 599 ప్లాన్​ కూడా ఒకటి. అయితే బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈ ప్లాన్​పై అదనపు డేటా అందిస్తామని ప్రకటించింది. ఈ ఉచిత అదనపు డేటా ఆఫర్​ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక ఈద్ ఆఫర్‌లో భాగంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్​లిమిటెడ్​ ఫ్రీ డేటాను అందిస్తోంది.

సాధారణంగా బీఎస్​ఎన్​ఎల్​ రూ.599 వర్క్- ఫ్రమ్ -హోమ్ ప్లాన్ కింద ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్, రోజుకు 5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్​ఎంఎస్​లు పొందవచ్చు. ఈ 5 జీబీ డేటా లిమిట్​ పూర్తయ్యాక వేగం 40 Kbps కి పడిపోతుంది. అపరిమిత కాలింగ్​ డేటాతో పాటు ఈ ప్లాన్​లో భాగంగా ఉచిత బీఎస్​ఎన్​ఎల్​ ట్యూన్లు, జింగ్ మ్యూజిక్ ఓటీటీకి ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ అందిస్తామని ప్రకటించింది. రూ. 599 విలువ గల ఈ ప్లాన్‌ కింద 84 రోజుల వరకు ఫ్రీ బెనిఫిట్స్​ పొందవచ్చు.

Asus Chromebook: రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది

Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే

ఈద్​ సందర్భంగా రాత్రి పూట అదనపు డేటా


"ఇద్​ ఉల్ -జుహా సందర్భంగా, కొత్త, ప్రస్తుత కస్టమర్ల కోసం WFH STV-599 ప్లాన్​లో అదనపు ఆఫర్లను అందిస్తున్నాం. ఈ ఆఫర్లలో భాగంగా రాత్రి సమయాల్లో ఉచితంగా అదనపు డేటా అందించాలని నిర్ణయించాం” అని బీఎస్​ఎన్​ఎల్​ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను ఎంతకాలం అమలు చేస్తుందనే విషయంపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు.

Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

ఇక, బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ .447 విలువ గల వోచర్​ను ప్రవేశపెట్టింది. ఇది 60 రోజుల పాటు 100 జిబి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా లిమిట్​ పూర్తయ్యాక వేగం 80 కెబిపిఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ కింద బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఈరోస్ నౌ వంటి ఎంటర్​టైన్​మెంట్​ ప్లాట్​ఫామ్​లకు ఉచిత సబ్​స్క్రిప్షన్​ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గూగుల్ స్మార్ట్ పరికరాలపై డిస్కౌంట్ కూడా అందజేస్తుంది. దీని ప్రకారం బిఎస్ఎన్ఎల్ బ్రాడ్​బ్యాండ్ కస్టమర్లు స్మార్ట్ పరికరాలను రాయితీ రేటుతో కొనుగోలు చేయవచ్చు. ఎఫ్​టిటిహెచ్, ఎయిర్ ఫైబర్, డిఎస్ఎల్ బ్రాడ్​బ్యాండ్ లేదా బిబివైఫై (బ్రాడ్​బ్యాండ్​ ఓవర్ వైఫై) సేవలకు సబ్​స్క్రైబ్​ చేసుకున్న బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత, కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్​ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: