BSNL Offering Free Fiber Connection: ఉచితంగా ఫైబ‌ర్ క‌నెక్ష‌న్.. ఫ్రాంఛైజీలకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

(ప్రతీకాత్మక చిత్రం)

వినియోగ‌దారుల‌కు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) అదిరిపోయే ఆఫ‌ర్‌ను ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్‌(BSNL) కంపెనీ ఫ్రాంచైజీ(franchise) కంపెనీల‌కు ఉచితంగా ఎయిర్ ఫైబ‌ర్ క‌నెక్ష‌న్ అందిస్తోంది.

  • Share this:
    వినియోగ‌దారుల‌కు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) అదిరిపోయే ఆఫ‌ర్‌ను ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్‌(BSNL) కంపెనీ ఫ్రాంచైజీ(franchise) కంపెనీల‌కు ఉచితంగా ఎయిర్ ఫైబ‌ర్ క‌నెక్ష‌న్ అందిస్తోంది. ఇలా అందించే స‌ర్వీస్‌ల‌ను రేడియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ (RBSP) అని అంటారు. ఈ క‌నెక్ష‌న్‌కు అర్హ‌త క‌లిగ‌ని కలిగిన ఫ్రాంచైజీలకు ఉచితం కనెక్షన్ ఇస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ టెల్కో 40 Mbps ప్లాన్‌ను కూడా ఉచితంగా అందించ‌నున్న‌ట్లు తెలిపింది. కానీ ఇత‌రులు ఎవ్వ‌రూ బీఎస్ఎన్ఎల్ ఉచితంగా(Free) ఇచ్చిన ఫ్రాంఛైంజీ కంపెనీల నుంచి ఉచితంగా క‌నెక్ష‌న్ పొంద‌లేరు. బీఎస్ఎన్ఎల్(BSNL) నుంచి ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి భారత్ ఎయిర్ ఫైబర్ ఫ్రాంచైజీలు కనీసం 50 FTTH కనెక్షన్‌లను అందించాలి.

    Samsung Galaxy Z Fold 3: అదిరిపోయే ఫీచ‌ర్‌ల‌తో శామ్‌సంగ్ ఫోల్డ‌బుల్ ఫోన్‌లు


    అర్హులు ఎవ‌రంటే..
    బీఎస్ఎన్ఎల్ నుంచి ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ FTTH కనెక్షన్‌లను అందించిన ఫ్రాంచైజీ ఉంటే వారికి ఈ ఆఫర్‌కు నేరుగా అర్హత పొందుతారు. ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం ముందుగా బీఎస్ఎన్ఎల్ ఎయిర్‌ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌(Basic Plan)తో భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌, ఉచిత డెమో లభిస్తుంది. దీని వేగం సుమారు 40 Mbps ఉంటుంది. రూ.699ల‌తో క‌నీసం 50 బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్‌ల‌ను ఎయిర్ ఫైబ‌ర్(Air Fiber) భాగ‌స్వామికి చెంద‌న ప్ర‌తీ కార్యాల‌యానికి అందిస్తుంది. ఈ డెమో క‌నెక్ష‌న్‌ను బీఎస్ఎన్ఎల్ ఫ్రాంఛైజీలు మాత్ర‌మే వినియోగించుకోవాలి. ఇత‌రులు వినియోగించుకోకూడ‌దు. ఫ్రాంఛైజీలు డెమో కనెక్షన్‌ను(Demo Connection) ఎవరికీ విక్రయించడానికి అనుమతి లేదు. డెమో కనెక్షన్ కోసం బీఎస్ఎన్ఎల్ ఎటువంటి బిల్లులను జారీ చేయదు.
    Published by:Sharath Chandra
    First published: