బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: రూ.78తో 20 జీబీ డేటా

ప్రీపెయిడ్ యూజర్ల కోసం మరో ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.78 చెల్లించి ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కాలింగ్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 10 రోజుల పాటు 20 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వేలిడిటీ 10 రోజులు మాత్రమే.

news18-telugu
Updated: November 24, 2018, 1:19 PM IST
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: రూ.78తో 20 జీబీ డేటా
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: రూ.78తో 20 జీబీ డేటా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ ఆపరేటర్లైన ఎయిర్‌టెల్, జియో నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అందుకే కొత్త కొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం మరో ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.78 చెల్లించి ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కాలింగ్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 10 రోజుల పాటు 20 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వేలిడిటీ 10 రోజులు మాత్రమే.

బీఎస్ఎన్ఎల్‌కు చెందిన 22 సర్కిళ్లలో ఈ ప్లాన్ వాడుకోవచ్చు. యూజర్లకు 2జీ/3జీ డేటా బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. 123 నెంబర్‌కు ‘STV COMBO78’ మెసేజ్ పంపించి అన్‌‌లిమిటెడ్ వీడియో కాలింగ్ ఆప్షన్ వాడుకోవచ్చు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ రూ.1,097 ధరకు వార్షిక ప్లాన్ ప్రకటించింది. యూజర్లకు 25 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 365 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

శబరిమలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేరూ.2 లక్షల్లోపు టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే...

గుడ్ న్యూస్: ఇక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మొబైల్‌లో చూపిస్తే చాలు

కోల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ పొందడం ఎలా?షాపింగ్‌కు వెళ్తున్నారా? డబ్బు ఆదా చేసే 9 మార్గాలివే...
First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>