HOME »NEWS »TECHNOLOGY »bsnl is giving away free sim cards for limited period sk gh

BSNL Offer: బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచిత సిమ్ ఇలా పొందండి..

BSNL Offer: బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచిత సిమ్ ఇలా పొందండి..
ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఉన్న BSNL రిటైల్ స్టోర్‌లో వినియోగదారులు ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. సిమ్ కార్డుతో పాటు కనెక్షన్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు.

  • Share this:
ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. చందాదారుల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఆ సంస్థ ఆకట్టుకునే ప్లాన్లు, ఒప్పందాలు, ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కొత్త వినియోగదారులకు ఉచితంగా సిమ్ కార్డు ఇస్తామని తెలిపింది. సాధారణంగా BSNL ప్రతి కొత్త సిమ్ కార్డుకు రూ.20 వసూలు చేస్తుంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల మాదిరిగానే BSNL కూడా సిమ్ కార్డుపై నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కానీ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కనీసం 100 రూపాయలతో ఫస్ట్ రీఛార్జ్ (FRC) చేసే కస్టమర్లకు సిమ్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ తెలిపింది.

* ఆఫర్ కొన్ని రోజులే...


BSNL ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ నవంబర్ 14 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమే, అంటే 15 రోజుల వరకే అందుబాటులో ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు BSNL నుంచి కొత్త సిమ్ కార్డు పొందటానికి రూ.20 చెల్లించాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని BSNL కార్యాలయాల్లోనూ ఫ్రీ సిమ్ కార్డ్ ఆఫర్ను వినియోగదారులు పొందవచ్చు.

* పాన్ ఇండియా ఆపరేటర్‌గా బీఎస్‌ఎన్‌ఎల్
వచ్చే ఏడాది జనవరిలో MTNL లైసెన్స్ గడువు ముగుస్తుంది. దీంతో BSNL త్వరలో పాన్ ఇండియా ఆపరేటర్‌గా మారేందుకు ప్రణాళికలు వేస్తుంది. ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఈ సంస్థ మొబైల్ సేవలను ప్రారంభించనుందని బిజినెస్ స్టాండర్డ్ వార్తాసంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ 20 టెలికాం సర్కిళ్లలో పనిచేస్తుంది. ఎమ్‌టీఎన్ఎల్ దిల్లీ, ముంబై సర్కిల్‌లలోనే పనిచేస్తోంది. MTNL లైసెన్స్ గడువు ముగిసిన తరువాత BSNL మిగతా రెండు సర్కిల్‌లను స్వాధీనం చేసుకొని పాన్ ఇండియా ఆపరేటర్‌గా మారే అవకాశం ఉంది.

* ఉచిత సిమ్ కార్డు పొందండిలా...
దేశవ్యాప్తంగా ఉన్న BSNL రిటైల్ స్టోర్‌లో వినియోగదారులు ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్‌ను  సొంతం చేసుకోవచ్చు. సిమ్ కార్డుతో పాటు కనెక్షన్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఆఫర్‌ కోసం తప్పనిసరిగా రూ.100తో మొదటి రీఛార్జ్(FRC) చేయించాలి. వివిధ రకాల ఎఫ్ఆర్సీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్షన్ ఎంచుకునే సమయంలో వీటిని పొందవచ్చు. కొత్త బ్రాడ్‌బ్యాండ్ సేవలను రూ.599 ప్రారంభ ధరతో అందిస్తామని ఆ సంస్థ ఇటీవల ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్లో 3300GB డేటాను 60Mbps వేగంతో పొందవచ్చు. అన్‌లిమిటెడ్ డేటా, 24 గంటల అపరిమిత కాలింగ్ వంటి మరిన్ని సేవలను సంస్థ అందిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:November 16, 2020, 19:07 pm