హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

BSNL News: బీఎస్‌ఎన్ఎల్ అదిరే శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు, 1000కి పైగా ఛానళ్లు చూడొచ్చు!

BSNL News: బీఎస్‌ఎన్ఎల్ అదిరే శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు, 1000కి పైగా ఛానళ్లు చూడొచ్చు!

BSNL News: బీఎస్‌ఎన్ఎల్ శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు!

BSNL News: బీఎస్‌ఎన్ఎల్ శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు!

BSNL Offer | బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. దీంతో ఏపీ కస్టమర్లు1000కి పైగా ఛానళ్లు పొందొచ్చు. దీని కోసం కంపెనీ వేరొక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

IPTV | ప్రభుత్వ రంగానికి చెందిన టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL - బీఎస్ఎన్ఎల్) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. సిటీ ఆన్‌లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇంటర్నెట్ (Internet) ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

సిటీ ఆన్‌లైన్ మీడియాకు చెందిన ఉల్కా టీవీ బ్రాండ్ కింద ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) సర్కిల్ కస్టమర్లకు త్వరలోనే 1000కి పైగా చానళ్లు అందుబాటులోకి రానున్నాయి. బ్రాండ్ బాండ్ కనెక్షన్‌తో పాటు ఈ సేవలు పొందొచ్చు. దీని వల్ల కస్టమర్లు టీవీకి, బ్రాడ్‌బాండ్‌కు విడివిడిగా కనెక్షన్లు తీసుకోవాల్సిన పని లేదు. బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ వివేక్ బంజాల్ విజయవాడలో ఈ సర్వీసులు ఆవిష్కరించారు. ఐదు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫ్రీ టు ఎయిర్, స్టాండర్డ్ డెఫినేషన్ బేసిక్, స్టాండర్డ్ డెఫినేషన్ బొనాంజా, హై డెఫినేషన్ బేసిక్, హై డెఫినేషన్ బొనాంజా అనేవి వీటి పేరు. వీటి ధర వరుసగా 130, రూ. 229, రూ. 259, రూ. 279, రూ.329గా ఉంది.

రూ.500కే హెచ్‌డీ డీటీహెచ్ బాక్స్.. రీచార్జ్‌పై 40 శాతం తగ్గింపు!

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లు ఇకపై ఐటీటీవీ సర్వీసులు పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ అనేది దేశంలోని అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. ఐపీటీవీ సర్వీసులు అనేవి క్వాలిటీతో ఉంటాయి. ఎందుకంటే ఈ సేవలు శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా కాకుండా ఫైబర్ ద్వారా లభిస్తాయి. ఐపీ టీవీ ద్వారా మరో బెనిఫిట్ కూడా ఉంది. టీవీ ఛానల్స్‌ను టీవీలోనూ, స్మార్ట్‌ఫోన్‌లోనూ రెండింటిలోనూ చూడొచ్చు. అలాగే ఉల్కా టీవీ ప్రత్యేకమైన యాప్ కూడా ఉంటుంది.

20 పైసలతో కిలోమీటర్ వెళ్లొచ్చు.. 125 కి.మి. రేంజ్‌తో అదరగొడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్!

మరోవైపు రైల్‌టెల్ కూడా ఐపీటీవీ సర్వీసులు అందించనుంది. ఈ కంపెనీ కూడా సిటీ ఆన్‌లైన్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రైల్‌టెల్‌కు చెందిన రిటైల్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ విభాగం రైల్‌వైర్ ఇకపై తన కస్టమర్లకు ఐటీ టీవీ సేవలను అందుబాటులో ఉంచనుంది.

ఇకపోతే ఉల్కా టీవీ అనేది లేటెస్ట్ 4కే టెక్నాలజీ హై ఎఫిసియెన్సీ వీడియో కోడింగ్ ద్వారా కస్టమర్లకు బెస్ట్ క్వాలిటీ సర్వీసులు అందిస్తోంది. కస్టమర్లు ఓటీటీ అప్లికేషన్స్, లైవ్ శాటిలైట్ టీవీ ఛానల్స్ చూడొచ్చు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సర్వీసులు రూ. 399 నుంచి ప్రారంభం అవుతున్నాయి. నెలకు రూ. 399 చెల్లించాలి. మీకు 39 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ వస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఐపీటీవీ సర్వీసులు అందించే అవకాశం ఉంది. ఇకపోతే బీఎస్ఎన్ఎల్ కంపెనీ ఇటీవలనే బేసిక్ బ్రాడ్ బాండ్ ప్లాన్‌ను తొలగించింది. ఇది రూ. 329 ప్లాన్. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ కింద కస్టమర్లకు 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1 టీబీ డేటా లభించేది.

First published:

Tags: BSNL, Ott, Ott platform, TV channels

ఉత్తమ కథలు