BSNL Bharat Fibre plans: భారత్ ఫైబర్ ప్లాన్ల ధరలను ప్రకటించిన BSNL..తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత ఏడాది అక్టోబర్లో భారత్ ఫైబర్ ప్లాన్లను తీసుకు వచ్చింది. ఇవి రూ.449 నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ ఈ ప్లాన్లను సంస్థ కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో పాత ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి ప్రవేశపెట్టింది.

  • Share this:
టెలికాం సంస్థలు డేటా సేవలను విస్తరించేందుకు ఫైబర్ నెట్‌వర్క్‌ల పరిధిని పెంచుతున్నాయి. వివిధ సంస్థలు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు కొన్ని ప్రత్యేక పథకాలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత ఏడాది అక్టోబర్లో భారత్ ఫైబర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.449 నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ ఈ ప్లాన్లను సంస్థ కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. కొన్ని ప్లాన్లను ఆపేయనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పాత ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం జులై వరకు చెల్లుబాటు అవుతాయని సంస్థ తెలిపింది. వీటితో పాటు అదనంగా ఎయిర్ ఫైబర్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.


రూ.449 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్
BSNL భారత్ ఫైబర్ విభాగంలో ఇది బేసిక్ ప్లాన్. రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకున్నవారు 30 Mbps స్పీడ్‌తో 3300GB FUP లిమిట్‌తో డేటాను పొందవచ్చు. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 2Mbpsకు తగ్గుతుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకునే యూజర్లు భారతదేశంలోని ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సేవలను కూడా పొందవచ్చు.భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ (రూ.799)
ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 100 Mbps స్పీడ్‌తో 3300GB డేటాను పొందవచ్చు. ఈ FUP లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 2 Mbpsకు తగ్గిపోతుంది.ప్రీమియం ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ (రూ.999)
బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్‌తో ఫైబర్ ప్రీమియం బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. దీంతో రీఛార్జ్ చేసుకున్న వారు 3300GB డేటాను 200 Mbps వేగంతో పొందవచ్చు. ఈ లిమిట్ తరువాత డేటా స్పీడ్ 2Mbpsకు తగ్గుతుంది. దీంతోపాటు డిస్నీ ప్లస్, హాట్ స్టార్ స్ట్రీమింగ్ యాప్‌ల మెంబర్‌షిప్‌ను ఉచితంగా పొందవచ్చు.

అల్ట్రా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ (రూ.1499)
ఈ ప్లాన్ 4000GB డేటాను 300 Mbps స్పీడ్‌తో అందిస్తోంది. 4000GB FUP పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 4 Mbpsకు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ యాప్‌లకు ఉచితంగా మెంబర్‌షిప్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఈ ప్లాన్ కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉంది.

BSNL తాజాగా ఎయిర్ ఫైబర్ ప్లాన్లను కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను కేరళ టెలికాం విభాగం వెల్లడించింది. ఈ ప్లాన్ల డేటా స్పీడ్ 30 Mbps నుంచి 70 Mbps వరకు ఉంటుంది. సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్ ఫైబర్ ప్లాన్ల వివరాలు..

BSNL ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లాన్ (రూ.499)
ఈ ప్లాన్ ధర రూ.499. దీన్ని ఎంచుకున్నవారు 3300GB డేటాను 30Mbps డౌన్ లోడ్ స్పీడ్‌తో పొందవచ్చు. 3300GB దాటిన తర్వాత డేటా స్పీడ్ 2Mbpsకు పడిపోతుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సేవలను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుంది.

ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ (రూ.699)
ఈ నెలవారీ డేటా ప్లాన్ ద్వారా కస్టమర్లు 3300GB డేటాను 40Mbps స్పీడ్‌తో పొందవచ్చు. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా వేగం 4Mbpsకు తగ్గుతుంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సేవలను కూడా పొందవచ్చు.

ఎయిర్ ఫైబర్ వ్యాల్యూ ప్లాన్ (రూ.899)
ఇది కూడా నెలవారీ డేటా ప్లాన్. దీని ద్వారా కస్టమర్లు 3300GB వరకు డేటాను 50Mbps స్పీడ్‌తో పొందవచ్చు. 3300 జీబీ దాటిన తరువాత డేటా స్పీడ్ 6 Mbpsకు తగ్గిపోతుంది. అదనంగా అన్‌లిమిడెట్ కాలింగ్ సేవలను పొందవచ్చు.

ఎయిర్ ఫైబర్ ప్రీమియం ప్లాన్ (రూ.1199)
ఈ ప్రీమియం ప్లాన్ వాయిస్ కాల్స్‌తో పాటు 70Mbps స్పీడ్‌తో 3300GB డేటాను అందిస్తుంది. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 10Mbpsకు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో స్టాటిక్ IP అడ్రస్ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. ఇందుకు అదనంగా రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.


Published by:Nikhil Kumar S
First published: